Kiara Advani: అయిదు సినిమాలు.. 900 కోట్ల వ్యాపారం.. మోస్ట్ వాంటెడ్‌గా అందాల తార

ABN , First Publish Date - 2022-07-29T17:48:21+05:30 IST

మహేశ్ బాబు మూవీ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ...

Kiara Advani: అయిదు సినిమాలు.. 900 కోట్ల వ్యాపారం.. మోస్ట్ వాంటెడ్‌గా అందాల తార

మహేశ్ బాబు మూవీ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ (Kiara Advani). హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ నటి అనంతరం పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది. ఎనిమిదేళ్ల కెరీర్‌లో.. ఆమె ఇప్పటికే ఏడు సూపర్‌హిట్‌లను అందించింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కియారా నటించిన ప్రతి బాలీవుడ్ మూవీ కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. అందులోనూ ఆమె నటించిన ఐదు సినిమాలు మాత్రమే థియేటర్స్‌లో విడుదల కాగా.. అవి దాపు రూ.900 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టాయి. అందుకే పలువరు దర్శక నిర్మాతలు, నటులు ఆమె తమకి లక్కీ ఛామ్‌ అని చెబుతూ ఉంటారు.


కియారా అడ్వాణీ 2014లో ‘ఫగ్లీ’ అనే సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ.. 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)తో కలిసి చేసిన ‘ఎంఎస్ ధోని (MS Dhoni)’ సినిమాతో ఈ బ్యూటీ కెరీర్ మారిపోయింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దేశీయ మార్కెట్‌లో దాదాపు రూ.135 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది.


అలాగే.. 2018లో కరణ్ జోహార్ నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్‌’తో కియారా ఆకట్టుకుంది. అనంతరం 2019లో ఈ తార చేసిన ‘కబీర్ సింగ్‌’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.280 కోట్ల కలెక్షన్లతో కొల్లగొట్టింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అదే సంవత్సరం.. ఈ బ్యూటీ రాజ్ మెహతా దర్శకత్వంలో ‘గుడ్‌న్యూజ్‌’లో నటించింది. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్ దోసాంజ్ ఈ మూవీ కీలకపాత్రల్లో నటించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ సైతం ఇండియన్ మార్కెట్లో  ప్రొడక్షన్ రూ.210 కోట్లు రాబట్టింది.


ఆ తర్వాత 2020లో కియారా నటించిన థ్రిల్లర్ ‘గిల్టీ’ నెట్‌ఫ్లిక్స్ విడుదలై మంచి వ్యూస్‌ని సాధించింది. 2021లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘షేర్షా’ సైతం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా.. ఈ ఏడాది విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ దాదాపు రూ.190 కోట్లు, ‘జుగ్ జుగ్ జీయో’ సైతం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. దీంతో ఈ బ్యూటీ దర్శక నిర్మాతలతోపాటు నటులకి కూడా లక్కీ ఛామ్‌గా మారిపోయింది.


అందుకే.. ధర్మ ప్రోడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న కరణ్ జోహార్ (Karan Johar) ఓ సందర్భంలో కియారా గురించి మాట్లాడాడు. అందులో.. ‘ధర్మ ప్రొడక్షన్స్‌కి కియారా కచ్చితంగా అదృష్ట దేవత. ఆమెతో నా ప్రయాణం లస్ట్ స్టోరీస్ ఆంథాలజీతో ప్రారంభమైంది. ఆ తర్వాత నా ప్రొడక్షన్‌లో పలు సినిమాలు చేసింది. మేము ఆమెతో చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుని మాకు లాభాలను తెచ్చిపెట్టింది’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. కియారా, వరుణ్ ధావన్ (Varun Dhawan) కలిసి ‘జుగ్ జుగ్ జియో’ సినిమా చేశారు. అది మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఓ షోలో కియారాని వరుణ్ లక్కీ ఛామ్ అని పిలిచాడు.

Updated Date - 2022-07-29T17:48:21+05:30 IST