అలనాటి ప్రముఖ హీరోయిన్‌తో పోలికపై Kiara Advani స్పందన!

ABN , First Publish Date - 2021-10-11T14:28:48+05:30 IST

`అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్` సినిమాతో బాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కియారా ఆడ్వాణీ.

అలనాటి ప్రముఖ హీరోయిన్‌తో పోలికపై Kiara Advani స్పందన!

`అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్` సినిమాతో బాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కియారా ఆడ్వాణీ. వరుసబెట్టి అవకాశాలు అందుకుంటోంది. ఆగ్ర హీరోల సరసన నటిస్తోంది. మరోవైపు దక్షిణాది నుంచి కూడా భారీ ఛాన్సులు అందుకుంటోంది. తమిళ అగ్ర దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కియార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కియారను చాలా మంది అలనాటి ప్రముఖ నటి హేమా మాలినితో పోలుస్తున్నారు. 


తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కియార ఆ పోలికపై స్పందించింది. `నన్ను హేమా మాలినితో పోలుస్తూ చాలా మంది కామెంట్లు చేస్తుంటారు. అంత పెద్ద నటితో పోలుస్తున్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటారు. ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. నన్ను ఆమెతో పోల్చినపుడు ఎలా స్పందించాలో అర్థం కాదు. ఆమెతో పోల్చడం గర్వకారణమే అయినా.. నాకంటూ ప్రత్యేక శైలి ఉండాలని కోరుకుంటాను. నేనెలా ఉంటానో అలా ఉండడమే నాకిష్టమ`ని కియార చెప్పింది. 

Updated Date - 2021-10-11T14:28:48+05:30 IST