Khushi movie : కశ్మీర్ షెడ్యూల్ పూర్తి

ABN , First Publish Date - 2022-05-23T15:55:43+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అందాల సమంత (Samantha) జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Khushi). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మహానటి’ (Mahanati) చిత్రం సూపర్ హిట్ తర్వాత విజయ్, సామ్ ఈ మూవీతో మరోసారి జోడీ కట్టనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Khushi movie : కశ్మీర్ షెడ్యూల్ పూర్తి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అందాల సమంత (Samantha) జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Khushi). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మహానటి’ (Mahanati) చిత్రం సూపర్ హిట్ తర్వాత విజయ్, సామ్ ఈ మూవీతో మరోసారి జోడీ కట్టనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఈ ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ఎంతో అందంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సుందరమైన లొకేషన్స్‌ను సెట్ చేశారు. మొన్నీమధ్యే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చాలా గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే, పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టింది చిత్ర బృందం. మొదటి షెడ్యూల్‌ను కశ్మీర్‌లో మొదలుపెట్టారు. అక్కడే విజయ్, సామ్‌ల బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరిపారు. ఇక తాజాగా ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ దిగిన ఫోటోను షేర్ చేశారు. అలాగే రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలిపారు.


ఇంతకు ముందు శివ నిర్వాణ (Shiva Nirvana) తీసిన ‘నిన్నుకోరి (Ninnu Kori), మజిలీ (Majili)’ చిత్రాల తరహాలో..  ఈ సినిమాలోనూ విజయ్, సామ్‌ల మధ్య సాగే ఎమోషనల్ జెర్నీ ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుందని చెబుతున్నారు.  ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ చిత్రాలతో డిఫరెంట్ ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ ( (Vijay Devarakonda ).. ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ పాత్రను పోషిస్తున్నాడట. ఈ సినిమాకి అదే హైలైట్ అని చెబుతున్నారు. అలాగే... సామ్ (Sam) కేరక్టరైజేషన్ కూడా అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుందట. ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.  హేషమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజయ్, సామ్‌లకు ఏ స్థాయిలో సక్సెస్‌నిస్తుందో చూడాలి.   



Updated Date - 2022-05-23T15:55:43+05:30 IST