Janhvi Kapoor and Khushi Kapoor: అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు డేటింగ్..? ఫ్యాన్స్ సందేహానికి కారణమిదే..

ABN , First Publish Date - 2022-08-19T14:49:22+05:30 IST

దివంగత నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్‌ చిన్న కుమార్తె ఖుషీ కపూర్. సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో..

Janhvi Kapoor and Khushi Kapoor: అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు డేటింగ్..? ఫ్యాన్స్ సందేహానికి కారణమిదే..

దివంగత నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్‌ చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Khushi Kapoor). సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ మంచి పాపులారిటీ సాధించింది. త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రముఖ డైరెక్టర్ జోయా అక్తర్ (Joya Akthar) దర్శకత్వంలో వహిస్తున్న ‘ది ఆర్చీస్‌’తో బాలీవుడ్‌కి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాపులర్ ఫిగర్ కావడంతో ఖుషీ వ్యక్తిగత జీవితాన్ని నెటిజన్లు గమనిస్తూనే ఉంటారు. ఈ భామ తాజాగా కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ పోస్ట్ చూసి.. అక్క మాజీ ప్రియుడితో ఈ బ్యూటీ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వారి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.


అందులో.. ఖుషీ బాత్‌రూమ్‌లో దిగిన పిక్, ఓ కన్‌సర్ట్‌కి సంబంధించిన వీడియోని, అలాగే ఓ వ్యక్తితో చాలా క్లోజ్‌గా ఉన్న పిక్‌ ఉన్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు అక్షత్ రాజన్‌. ఖుషీ ఈ పిక్స్‌ని పోస్ట్ చేసిన కొద్దిసేపటికీ అక్షయ్ ‘ly’ అని కామెంట్ పెట్టాడు. అంటే ‘లవ్ యూ’ అని షార్ట్‌గా రాశాడన్నమాట. ఆ కామెంట్‌కి ఖుషీ స్పందిస్తూ.. ‘ilu’ అని రిప్లై ఇచ్చింది. అంటే ‘ఐ లవ్ యూ’ అని ఖుషీ రిప్లై ఇచ్చిందన్నమాట. దీంతో వారిద్దరూ లవ్‌లో ఉన్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి.


ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఇదే అక్షత్ రంజన్‌తో ఖుషీ అక్క జాన్వీ కపూర్(Janhvi Kapoor) గతంలో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. 2016లో శ్రీదేవి నటించిన చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రం ప్రిమియర్ షోకి జాన్వీ, అక్షత్ కలిసి పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవ్నీ వట్టి పుకార్లేనని, అతను తనకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడని జాన్వీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయినా.. ఈ పుకార్లు ఆగలేదు. అనంతరం కొన్నాళ్ల డేటింగ్ తర్వాత వారిద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు డేటింగ్ చేస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా.. ఈ న్యూస్ నిజమౌతుందో లేక రూమర్‌గానే మిగిలిపోతాయో చూడాలి.



Updated Date - 2022-08-19T14:49:22+05:30 IST