Khushi: ఈ ముగ్గురికీ హిట్టు తప్పనిసరి..

ABN , First Publish Date - 2022-09-03T14:27:41+05:30 IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి (Khushi). శివ నిర్వాణ (Siva Nirvana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Khushi: ఈ ముగ్గురికీ హిట్టు తప్పనిసరి..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి (Khushi). శివ నిర్వాణ (Siva Nirvana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాతో ముగ్గురు హిట్ అందుకుంటారా..? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనికి కారణం వీరి గత చిత్రాలు ఫ్లాప్‌గా మిగలడమే. ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ప్రమోషన్స్‌లో విజయ్ మాట్లాడిన తీరు చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అనే అందరూ మాట్లాడుకున్నారు.


కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లైగర్ డిజాస్టర్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇక దర్శకుడు శివ నిర్వాణ కూడా తన గత చిత్రం టక్ జగదీష్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ నానితో తీసిన టక్ జగదీష్ మాత్రం ఫ్లాపయి షాకిచ్చింది. దాంతో ఇప్పుడు ఖుషి సినిమా మీదే నమ్మకాలన్నీ పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత పరిస్థితి కూడా అంతే.


కమిటవడానికి వరుసగా సినిమాలు కమిటైంది గానీ..అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అలాగే, యశోద కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. వాస్తవంగా ఆగస్టు 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో రూపొందుతున్న ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మరి ఈ సినిమా ఈ ముగ్గురికీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. సమంత నటించిన గత చిత్రం కణ్మణి రాంబో ఖతీజా కూడా ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-09-03T14:27:41+05:30 IST