Khudiram Bose: వెండితెరపై మరో బయోపిక్..

ABN , First Publish Date - 2022-08-11T18:14:07+05:30 IST

గత కొన్నేళ్ళుగా ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో సినీ, రాజకీయ నాయకుల, క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా చిత్రాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఫ్రీడమ్ ఫైటర్ల బయోపిక్స్ కూడా వచ్చి మంచి విజయాలను సాధించాయి.

Khudiram Bose: వెండితెరపై మరో బయోపిక్..

గత కొన్నేళ్ళుగా ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో సినీ, రాజకీయ నాయకుల, క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా చిత్రాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఫ్రీడమ్ ఫైటర్ల బయోపిక్స్ కూడా వచ్చి మంచి విజయాలను సాధించాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫ్రీడమ్ ఫైటర్ జీవిత కథను సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నారు. మొదటితరం స్వాతంత్య్ర సమరయోధుడు దేశం కోసం పోరాడిన ఖుదీరామ్ బోస్ (Khudiram Bose)  జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమాకు టైటిల్ కూడా అదే పేరు కావడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ మూవీ ద్వారా రాకేష్ జాగర్లమూడి (Rakesh Jagarlamudi) హీరోగా పరిచయమవుతున్నారు. విద్యాసాగర్ రాజు (Vidhyasagar Raju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజిత విజయ్ జాగర్లమూడి భారీ బడ్జెట్‌తో  నిర్మిస్తున్నారు. 1889లో పుట్టిన ఖుదీరామ్ బోస్ బ్రీటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన అత్యంత చిన్నవయసు వాడైన స్వాతంత్య్ర సమర యోధుడుగా చరిత్రలో నిలిచారు.


బ్రిటీష్ ప్రభుత్వం వల్ల దోషిగా పరిగణించి 1908 ఆగస్టు 11న మరణ శిక్షను విధించారు. ఈ కథ ముజాఫరాపూర్ కుట్ర కేసుకు సంబంధించిన చరిత్ర కారులకు బాగా తెలిసినదే. ఈ సినిమాను ప్రకటించిన మేకర్స్ 'ఇది చరిత్రలో దాగిన ఓ రత్నంకు సంబంధించిన పోరాటం' అని వెల్లడించారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్, అతుల్ కులకర్ణి, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  



Updated Date - 2022-08-11T18:14:07+05:30 IST