రోడ్డు ప్రమాదానికి గురయిన KGF నటుడి కారు

ABN , First Publish Date - 2022-07-01T00:21:55+05:30 IST

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చేరువైన నటుడు బీఎస్.అవినాష్ (BS Avinash). ఈ సినిమాల్లో అండ్రూ (Andrew) పాత్రలో అభిమానులకు కనిపించారు. ఆయన కారు తాజాగా

రోడ్డు ప్రమాదానికి గురయిన KGF నటుడి కారు

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చేరువైన నటుడు బీఎస్.అవినాష్ (BS Avinash). ఈ సినిమాల్లో అండ్రూ (Andrew) పాత్రలో అభిమానులకు కనిపించారు. ఆయన కారు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయింది. అందుకు సంబంధించిన వివరాలను అవినాష్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 


అవినాష్ జిమ్ చేయడానికి ఉదయం పూట కారులో బయలుదేరారు. అనిల్ కుంబ్లే సర్కిల్‌లో మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తున్నారు. ఓ ట్రక్కు అకస్మాత్తుగా వచ్చి ఆయన కారును డీకొట్టింది. ఉదయం 6గంటలప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నటుడికి ఎటువంటి గాయాలు కాలేదు. ట్రక్కు డ్రైవర్‌కు వ్యతిరేకంగా పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. ‘కెజియఫ్’ సినిమాకు భువన గౌడ (Bhuvan Gowda) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. భవన్‌కు అవినాష్‌తో పరిచయం ఉంది. అందువల్లే భువన్ ఆయనను ‘కెజియఫ్’ దర్శకుడైన ప్రశాంత్ నీల్‌కు పరిచయం చేశారు. ప్రశాంత్ నీల్ విలన్ పాత్రకు అవినాష్ సరిగ్గా సరిపోతాడని అవకాశమిచ్చారు. అవినాష్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభిమానులకు చేరువయ్యారు. ‘కెజియఫ్’ రెండు భాగాల్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించారు. ‘కెజియఫ్-2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద  తొలిరోజే దాదాపుగా రూ.50కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ప్రాంచైజీలో మూడో భాగం కూడా త్వరలోనే రాబోతుంది. అందుకు సంబంధించి ఎండ్ కార్డ్స్‌లో హింట్ కూడా ఇచ్చారు. 


Updated Date - 2022-07-01T00:21:55+05:30 IST