హరిహర వీరమల్లు: కీలక పాత్రలో బాలకృష్ణ

ABN , First Publish Date - 2022-04-18T23:34:23+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కెజియఫ్’ ప్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘కెజియఫ్’ సినిమాల్లో ఇనాయత్ ఖలీల్ పాత్రను ఓ తెలుగు నటుడు పోషించాడు.

హరిహర వీరమల్లు: కీలక పాత్రలో బాలకృష్ణ

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కెజియఫ్’ ప్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘కెజియఫ్’ సినిమాల్లో ఇనాయత్ ఖలీల్ పాత్రను ఓ తెలుగు నటుడు పోషించాడు. అతడి పేరు బాల‌కృష్ణ. ‘కెజియఫ్’ దర్శకుడైన ప్రశాంత్ నీల్‌కు అతడు దగ్గరి బంధువవుతాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీర‌మల్లు’ లో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తన పాత్రకు సంబంధించిన విశేషాలను తాజాగా అతడు మీడియాకు వెల్లడించాడు. 


టాలీవుడ్ దర్శకుడైన క్రిష్ జాగర్లమూడి ‘హరి‌హర వీరమల్లు’ ను తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన ఓ వెబ్ షో ‘మస్తీస్’ ను క్రిష్ చూశాడు. దీంతో ‘హరిహర వీరమల్లు’ లో ఓ పాత్రకు సంప్రదించాడు. రాజదర్బార్‌లో మంత్రి అయిన హకీం ఖాన్ అనే పాత్రను బాలకృష్ణకు ఇచ్చాడు. హైదరబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓడ సెట్ వేసి అతడిపై సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌లో భాగంగా అర్జున్ రాంపాల్‌పై దాడి చేశానని బాలకృష్ణ చెప్పాడు. బాలీవుడ్ నటుడైన అర్జున్ ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రను పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమా ‘‘అల్లుడు వేరే లెవెల్’’ లో బాలకృష్ణ  విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని బాలకృష్ణ వివరించాడు.

Updated Date - 2022-04-18T23:34:23+05:30 IST