Prabhas కు రాఖీ భాయ్ చెక్ పెడతాడా..!

ABN , First Publish Date - 2022-06-05T01:40:50+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా

Prabhas కు రాఖీ భాయ్ చెక్ పెడతాడా..!

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఫేమ్ తెచ్చుకున్నాడు. అందువల్ల తాను నటిస్తున్న సినిమాలన్నింటిని మేకర్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. పలు భాషల్లో రూపొందించి ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్‌ని కదిలించడం ఏ బాలీవుడ్ హీరో వల్ల కాలేదు. కానీ, ఓ దక్షణాది హీరో మాత్రం ‘బాహుబలి’ స్టార్‌కు చెక్ పెట్టబోతున్నాడంటూ కొంత మంది ప్రేక్షకులు అంటున్నారు.         


ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్‌ని కదిలించే సత్తా ‘కెజియఫ్’(KGF) హీరో యశ్‌(Yash)కు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కెజియఫ్: చాప్టర్-2’( K.G.F: Chapter 2) తో యశ్ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు. ఇండియన్ బాక్సాఫీస్‌కి అంటిన బూజును ఒక్క దెబ్బతో విదిలించాడు. దీంతో ప్రభాస్‌కు సరి అయిన పోటీ యశే అని కన్నడ సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. యశ్ ఒక్క సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకుపోయాడు. ఆ పరిశ్రమకు గుర్తింపును తీసుకువచ్చాడు. ‘కెజియఫ్’ హిట్ కావడంతోనే ప్రభాస్‌కు పోటీ ఇవ్వగల హీరో యశే అని శాండల్ వుడ్ అభిమానులు చెప్పుకొంటున్నారు. కానీ, కన్నడ అభిమానులు చెప్తున్న మాటల్లోనే అసలు సమస్యంతా ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్ని పాన్ ఇండియాగానే తెరకెక్కుతున్నాయి. రాబోయే రెండేళ్లలోనే అతడిపైన రూ. 1500కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాఖీభాయ్ ఈ స్థాయిలో సినిమాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి. అయితే, ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్‌కి యశ్ చెక్ పెడతాడో, లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.



Updated Date - 2022-06-05T01:40:50+05:30 IST