Vijay Kiragandur: ఇకపై Yash అలాంటి సినిమాలు చేస్తాడు.. KGF 3 వాళ్ల మీదే ఆధారపడి ఉంది

ABN , First Publish Date - 2022-05-26T16:34:53+05:30 IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో KGF Chapter 1 సీక్వెల్‌గా వచ్చిన KGF Chapter 2 సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ..

Vijay Kiragandur: ఇకపై Yash అలాంటి సినిమాలు చేస్తాడు.. KGF 3 వాళ్ల మీదే ఆధారపడి ఉంది

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో KGF Chapter 1 సీక్వెల్‌గా వచ్చిన KGF Chapter 2 సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో రూ.1200 కోట్లకి పైగా కలెక్షన్లని కొల్లగొట్టి దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లని కొల్లగొట్టిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో చేసిన రాకీ భాయ్ పాత్రతో ఈ కన్నడ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో ఈ సినిమా తర్వాత యశ్ ఎలాంటి కథలు ఎంచుకుంటాడనే అనుమానం యశ్ అభిమానుల్లో మొదలైంది. దీనిపై తాజాగా కేజీఎఫ్ సినిమాల నిర్మాత విజయ్ కిరగందర్ స్పందించాడు.


విజయ్ మాట్లాడుతూ.. ‘యశ్ ఇకపై కన్నడ స్టార్, సౌత్ ఇండియా స్టార్ కాదు. కేజీఎఫ్ 2తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. సినిమాలోని మ్యానరిజమ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఆయన ఇకపై పాన్-ఇండియన్ సినిమాలు మాత్రమే చేయబోతున్నాడు. ప్రస్తుతం యశ్ స్థాయి అదే. కాబట్టి అతను చిన్న సినిమాలు చేయలేడు. సినిమాల పరంగా ఆయనకి పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. వాటిని అధిగమించే పనిలో ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.


KGF చాప్టర్ 3 గురించి నిర్మాత మాట్లాడుతూ.. ‘అది ప్రశాంత్ నీల్, యశ్‌ ఎప్పుడూ ఫ్రీ అవుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌ చేస్తున్నాడు. యష్ కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇద్దరూ ఒకేసారి ఖాళీగా దొరకాలి. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుందని ఇప్పుడే చెప్పలేను’ అని తెలిపాడు.

Updated Date - 2022-05-26T16:34:53+05:30 IST