KGF Chapter 2 తో పోటీ కారణం కాదట.. ‘జెర్సీ’ సినిమా వాయిదాకు అసలు కారణం చెప్పిన నిర్మాత

ABN , First Publish Date - 2022-04-14T22:10:05+05:30 IST

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా ‘జెర్సీ’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.

KGF Chapter 2 తో పోటీ కారణం కాదట.. ‘జెర్సీ’ సినిమా వాయిదాకు అసలు కారణం చెప్పిన నిర్మాత

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా ‘జెర్సీ’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. ఏప్రిల్ 14న ఈ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు గల కారణాన్ని నిర్మాత అమన్ గిల్ తాజాగా మీడియాకు తెలిపాడు. 


‘కేజీఎఫ్: చాప్టర్-2’ తో క్లాష్‌ను నివారించడానికే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని అందరు అనుకున్నారు. కానీ, అది నిజం కాదని ‘జెర్సీ’ నిర్మాత అమన్ గిల్ తెలిపాడు. కాపీ రైట్ వివాదంతోనే మూవీని వాయిదా వేశామని చెప్పాడు. ‘జెర్సీ’ని సెలవురోజునే విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కోర్టులో సినిమాపై పిటిషన్ పడటంతో ప్రణాళికలన్ని విఫలమయ్యాయని స్పష్టం చేశాడు. విడుదలకు సమయం లేదన్నాడు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలనుకున్నామన్నాడు. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో అడ్డంకులన్ని తొలగిపోయాయని పేర్కొన్నాడు. 


‘జెర్సీ’ సినిమా కథ తనదేనంటూ రూపేశ్ జైస్వాల్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఈ కథ, కాన్సెఫ్ట్‌ను అక్రమ పద్ధతుల్లో ప్రతివాదులు సంపాదించారని వివరించాడు. తెలుగు, హిందీలో ‘జెర్సీ’ పేరుతో నిర్మించారని ఆరోపించాడు. కానీ, రూపేశ్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేస్తూ, నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తెలుగులో ‘జెర్సీ’ సినిమాను 2019లో నిర్మించారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్‌లో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. 

Updated Date - 2022-04-14T22:10:05+05:30 IST