Dangal ఓవరాల్ కలెక్షన్లు 22 రోజుల్లోనే బ్రేక్.. Bahubali 2 తర్వాతి స్థానం KGF 2 సినిమాదే..!

ABN , First Publish Date - 2022-05-06T19:27:32+05:30 IST

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజియఫ్ ఛాప్టర్ 2’ విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది...

Dangal ఓవరాల్ కలెక్షన్లు 22 రోజుల్లోనే బ్రేక్.. Bahubali 2 తర్వాతి స్థానం KGF 2 సినిమాదే..!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజియఫ్ ఛాప్టర్ 2’ విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 2018లో వీరి కాంబినేషన్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్ ఛాప్టర్ 1’కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. విడుదలకి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ విడుదల తర్వాత సైతం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీలోనూ పలు రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది.


హిందీ వెర్షన్ విడుదలకి ముందే ‘KGF Chapter 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డు క్రియేట్ చేసింది. అనంతరం విడుదల రోజు (ఏప్రిల్ 14)న సైతం కలెక్షన్స్‌తోనూ మరో రికార్డును బద్దలు కొట్టింది. ఆ జోరుని అలాగే కొనసాగిస్తూ తాజాగా ఆమిర్ ఖాన్ ‘దంగల్’ జీవితకాల కలెక్షన్ల అధిగమించి హిందీలో అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన రెండో సినిమాగా నిలిచింది. ‘Dangal’ హిందీ వెర్షన్ లైఫ్ టైమ్‌ రన్‌లో రూ.387.40 కోట్లు కలెక్ట్ చేయగా.. యశ్ మూవీ మే 5వరకు రూ.391.65 కోట్లు కొల్లగొట్టింది. కాగా.. ప్రభాస్ ‘బాహుబలి 2’ రూ.511.30 కోట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా ‘కెజియఫ్’ మే 6న రూ.400 కోట్ల మైలురాయిని సైతం దాటే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్, రమేశ్ బాలా ట్వీట్స్ చేశారు.


తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్‌లో.. ‘బిగ్ న్యూస్.. కెజియఫ్2, దంగల్ లైఫ్‌టైమ్ కలెక్షన్లని అధిగమించింది. ఇప్పుడు.. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ చిత్రం ఇదే. అదే వేగంతో రూ.400 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మూడోవారంలో.. శుక్ర-రూ. 4.25 కోట్లు, శని-7.25 కోట్లు, ఆది-9.27 కోట్లు, సోమ-3.75 కోట్లు, మంగళ-9.57 కోట్లు, బుధ-8.75 కోట్లు. మొత్తం: రూ.391.65 కోట్లు’ అంటూ రాసుకొచ్చాడు.


రమేష్ బాలా చేసిన ట్వీట్‌లో.. ‘కెజియఫ్ ఛాప్టర్ 2 హిందీ వెర్షన్ ఈరోజు (మే6)న ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్‌ను దాటుతుంది. బాహుబలి 2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హిందీ చిత్రం ఇదే..’ అని రాసుకొచ్చాడు.





Updated Date - 2022-05-06T19:27:32+05:30 IST