ఏది శాశ్వతం కాదు.. కానీ ఇప్పుడే ఏం చేయాలో తెలియట్లేదు : ‘KGF’ స్టార్ యశ్

ABN , First Publish Date - 2022-01-08T16:31:01+05:30 IST

‘కేజీఎఫ్’ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ యశ్ నటించిన..

ఏది శాశ్వతం కాదు.. కానీ ఇప్పుడే ఏం చేయాలో తెలియట్లేదు : ‘KGF’ స్టార్ యశ్

‘కేజీఎఫ్’ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియాలో స్థాయిలో ఎటువంటి యాక్స్‌పెక్టెషన్స్ లేకుండా విడుదలై సంచనలను సృష్టించింది. యశ్‌ని ఓవర్ నైట్ బిగ్ స్టార్‌ని చేసేసింది.


అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా విడుదలైన కొన్నిరోజులకే కరోనా విలయతాండవం చేయడం ప్రారంభించింది. దాంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో చాలా రంగాల ప్రజలు చేయడానికి పనిలేక, ఆదాయం లేకపోవడంతో నానాయాతనలు పడ్డారు. జనవరి 8న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా దీనిపై తాజాగా స్పందించాడు యశ్.


ఆయన మాట్లాడుతూ.. ‘జనాలు ఓ విధానానికి ప్రోగామ్ చేయబడి ఉన్నాం. మనం అనుకున్న విధానంలోనే పనులు జరగాలని అనుకుంటాం. కానీ అలా జరగకపోతే చాలా ప్రాబ్లెమ్ అవుతుంది. కానీ ప్రకృతి అనేది వేరు. దానికి వేరే ప్లాన్స్ ఉంటాయి. 


కరోనా వల్ల సినిమా పరిశ్రమ కాకుండా చాలా రంగాల్లోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన ఆదాయం లేదు. మానసికంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నారు. అదో బ్యాడ్ ఫేజ్. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఏది శాశ్వతం కాదు. సమయంలో గడుస్తున్న కొద్ది ఏ బాధైన తగ్గుతుంది. ఇది కూడా త్వరలోనే తగ్గిపోతుంద’ని తెలిపాడు.


‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ గురించి యశ్ మాట్లాడుతూ.. ‘ఫ్యాన్స్‌లాగే మేము కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే మేం ఏం తీశామో మాకు తెలుసు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని నాకు తెలుసు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ వల్ల కొంచెం టైమ్ తీసుకుంటుంద’ని చెప్పాడు.


తన పుట్టిన రోజు గురించి మాట్లాడుతూ.. ‘నా పుట్టినరోజు నా అభిమానుల కోసమే. నేను నటుడిని. నాకు పెద్ద కుటుంబం ఉంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మాత్రమే కాకుండా నా అభిమానులంతా నా కుటుంబమే. ఈ కరోనా సమయంలో పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో, ఏం చేయాలో మాకు తెలియట్లేద‌’ని పేర్కొన్నాడు.

Updated Date - 2022-01-08T16:31:01+05:30 IST