‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ‘ఆ రెండు చిత్రాలు’ ఇంకా చూడలేదట! అవేంటంటే...

ABN , First Publish Date - 2022-04-06T00:21:42+05:30 IST

‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ రిలీజ్‌ డేట్‌కి దగ్గరవుతుండటంతో హీరో యశ్ ప్రమోషన్స్‌తో బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే, ‘రాకీ భాయ్’ ఎంత బిజీగా ఉన్నాడంటే...

‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ‘ఆ రెండు చిత్రాలు’ ఇంకా చూడలేదట! అవేంటంటే...

‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ రిలీజ్‌ డేట్‌కి దగ్గరవుతుండటంతో హీరో యశ్ ప్రమోషన్స్‌తో బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే, ‘రాకీ భాయ్’ ఎంత బిజీగా ఉన్నాడంటే ‘ఆర్ఆర్ఆర్’, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలు కూడా ఆయన ఇంకా చూడలేదట. రాజమౌళి విజువల్ వండర్ వందల కోట్ల బడ్జెట్‌తో బరిలోకి దిగితే ‘కాశ్మీర్ ఫైల్స్’ చిన్న సినిమాగా తరలి వచ్చి కలెక్షన్ల కలకలం రేపింది. రెండూ బ్లాక్‌బస్టర్స్ అనిపించుకున్నాయి. అయినా, ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ మాత్రం వాటి వైపే చూడలేదట! కారణం ఏంటని అడిగిన మీడియాకి ప్రమోషన్స్‌ పనితో బిజీగా అన్నానని చెప్పాడు యశ్. ప్రస్తుతానికి తాను చూస్తోన్నది కేవలం ‘కేజీఎఫ్’నే అంటూ చమత్కరించాడు!


‘బాలీవుడ్ వర్సెస్ రీజినల్ సినిమా’ చర్చ గురించి కూడా యశ్ స్పందించాడు. తమ చిత్రాన్ని ‘డబ్బింగ్’ సినిమా అనటం సరికాదంటూ హితవు పలికాడు. ‘కేజీఎఫ్’ని షూటింగ్ తరువాత కన్నడ భాషలోనూ డబ్బింగ్ చేశామని చెప్పాడు. అలాగే, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ జరుగుతోందని ఆయన అన్నాడు. సినిమా ఎక్కడ రూపొందినా అందరూ, అంతటా ప్రస్తుతం చూస్తున్నారని అన్న యశ్ సౌత్, బాలీవుడ్ మధ్య దూరం చెరిగిపోతందని వ్యాఖ్యానించాడు. ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయిందని వివరించాడు. అలాగే, తన అభిమానులకి కూడా కన్నడ సూపర్ స్టార్ కృతజ్ఞతలు తెలిపాడు. వారే లేకుంటే తాను ఉండే వాడిని కానని అన్నాడు. తన పనితనం మరీ గొప్పగా లేకున్నా ఫ్యాన్సే తనని బాగా ఎంరేజ్ చేశారని చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-04-06T00:21:42+05:30 IST