Ketika Sharma: అలాంటి హీరోయిన్ అని డిసైడ్ చేస్తారా..?

ABN , First Publish Date - 2022-09-03T15:30:33+05:30 IST

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన వాళ్ళు హీరోయిన్ విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. కొత్తగా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమ్మాయికి మొదటి సినిమా

Ketika Sharma: అలాంటి హీరోయిన్ అని డిసైడ్ చేస్తారా..?

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన వాళ్ళు హీరోయిన్ విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. కొత్తగా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమ్మాయికి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే వరుసగా అవకాశాలు కట్టబెడతారు. ఒకవేళ మొదటి రెండు మూడు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలితే తీసి పక్కన పెడతారు. ఇప్పుడు కేతిక పరిస్థితి కూడా అదేనా.? అంటే నెటిజన్స్ అదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా రొమాంటిక్.


పూరి జగన్నాథ్ (Puri Jagannath) ఈ సినిమాను నిర్మించారు. ఆయన వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. పూరి మార్క్‌తో రూపొందించిన రొమాంటిక్‌లో ఆకాష్ పూరి హీరో. ట్రైలర్‌తో మంచి అంచనాలను పెంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే, కేతిక గ్లామర్, అండ్ ఫర్పార్మెన్స్‌ పరంగా అందరినీ ఆకట్టుకోవడంతో, ఆ తర్వాత రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించే అవకాశాలు అందుకుంది. వాటిలో ఒకటి నాగ శౌర్య సరసన నటించిన లక్ష్య..మరో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగ రంగ వైభవంగా.


లక్ష్య సినిమా అట్టర్ ఫ్లాపయిన సంగతి తెలిసిందే. అయినా కేతిక నటించిన రంగ రంగ వైభవంగా (Ranga Ranga vaibhavamga) మూవీపై బాగానే అంచనాలు పెరిగాయి. కానీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా కేతిక నటించిన మూడవది. ఇది కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. హ్యాట్రిక్ హిట్స్ అన్నట్టుగా కేతిక హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూసింది. ఇప్పుడు అమ్మడి కెరీర్ డైలమాలో ఉందా..? అంటే అవుననే చెప్పాలి. ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చిన హీరోయిన్ మీద నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. ఫ్లాప్ హీరోయిన్‌గా పరిగణిస్తారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న వారి మీద కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేది. అయితే, వారికి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కేతికకి అలా అవకాశాలు ఇచ్చేవారుంటారా..అనేది చూడాలి.

Updated Date - 2022-09-03T15:30:33+05:30 IST