Ketika Sharma: తెలుగులో పాట పాడిన కేతికా శర్మ.. ఇప్పుడు మరో రచ్చ!

ABN , First Publish Date - 2022-09-04T03:15:48+05:30 IST

హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేక పోయాయి. ‘రొమాంటిక్’ (Romantic), ‘లక్ష్య’ (Lakshya).. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’

Ketika Sharma: తెలుగులో పాట పాడిన కేతికా శర్మ.. ఇప్పుడు మరో రచ్చ!

హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేక పోయాయి. ‘రొమాంటిక్’ (Romantic), ‘లక్ష్య’ (Lakshya).. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) ఈ మూడు సినిమాలలోనూ ఆమె గ్లామర్‌కి మంచి మార్కులు పడ్డాయి కానీ. నటన విషయంలో మాత్రం ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. సినిమా విజయం సాధించి ఉంటే.. ఆమె నటన గురించి మాట్లాడే వారేమో కానీ.. ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషన్ల టైమ్‌లో ఆమె ‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘శ్రీ వల్లి’ (Sri Valli) సాంగ్‌ని తెలుగులో పాడి ఆశ్చర్యపరిచింది. తెలుగు హీరోయిన్లు కూడా పాడలేనంత స్పష్టంగా.. తెలుగులో ఆమె పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో విషయంలో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చవుతుండటం గమనార్హం.


‘‘చూపే బంగారమాయనే.. శ్రీ వల్లీ

నవ్వే నవరత్నమాయనే.. ’’ అంటూ ఓ సింగర్ పాడినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా కేతికా ఈ పాటని ఆలపించింది. ఆమె పాడిన విధానం చూసి ఆ పాటని కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా తెలుగు రాని ఓ అమ్మాయి.. ఈ ప్రయోగం చేసినందుకు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాలి. కానీ.. కొందరు ఉంటారు కదా.. దీనిని కూడా రచ్చ చేయడానికి. అసలు వారికి కావాల్సిందే అది అన్నట్లుగా.. మా హీరోయిన్ ఎప్పుడో పాడింది అంటూ.. కొందరు హీరోయిన్లు తెలుగులో పాడుతున్న పాటల వీడియోలను షేర్ చేస్తున్నారు. అందులో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించిన కృతిసనన్.. ఆ సినిమాలోని ‘ఒక గంట బీచ్ కెళదాం.. ఒక గంట ఫిష్ పడదాం.. ’ అంటూ సాగే పాటను పాడుతున్న వీడియోని పలువురు నెటిజన్లు షేర్ చేస్తూ.. ‘మా హీరోయిన్ ఎప్పుడో పాడేసింది’ అంటూ.. సోషల్ మీడియాలో టామ్ టామ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరో రచ్చ సోషల్ మీడియాలో మొదలైంది. విశేషం ఏమిటంటే.. ఈ రెండూ పాటలనూ కంపోజ్ చేసింది రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాదే. 





Updated Date - 2022-09-04T03:15:48+05:30 IST