Keerthi Suresh: టాలెంటెడే.. టైమ్ బ్యాడ్ అంతే..

ABN , First Publish Date - 2022-05-15T19:08:06+05:30 IST

కీర్తి సురేశ్ (Keerthi Suresh) టాలెంటెడే..కాకపోతే మధ్యలో కాస్త బ్యాడ్ టైమ్ నడిచిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహానటి (Mahanati) సినిమా తర్వాత వరుస

Keerthi Suresh: టాలెంటెడే.. టైమ్ బ్యాడ్ అంతే..

కీర్తి సురేశ్ (Keerthhi Suresh) టాలెంటెడే..కాకపోతే మధ్యలో కాస్త బ్యాడ్ టైమ్ నడిచిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహానటి (Mahanati) సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమైన కీర్తి ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఇటివలే కాలంలో కీర్తి సురేశ్ నటించిన సినిమాలు ఒకసారి చూస్తే... రజినీకాంత్‌తో పెద్దన్న, మోహన్ లాల్‌తో మరక్కర్, సోలోగా చేసిన గుడ్ లక్ సఖి... ఈ మూడు సినిమాలు తెలుగు తమిళ మలయాళ భాషల్లో నెగటివ్ టాక్ తెచ్చుకున్నవే. వీటికన్నా ముందే రిలీజ్ అయిన పెంగ్విన్, మిస్ ఇండియా, సామి 2, పందెం కోడి 2, మన్మధుడు 2, రంగ్ దే, ఇటీవల ఓటిటిలో వచ్చిన 'చిన్ని' దాకా వరుసగా ఫ్లాపయ్యాయి. 


అంటే 2018 సెప్టెంబర్ నుంచి కీర్తి సురేశ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అయిన రికార్డ్ లేదు. మహానటి నుంచి రీసెంట్ గా వచ్చిన చిన్ని దాకా అన్ని ప్లాప్ సినిమాలే. ఇక ఇటివలే వచ్చిన సర్కారు వారి పాట కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అక్కడ ఉన్నది మహేష్ బాబు కాబట్టి సినిమా బాక్సాఫీస్ దెగ్గర నడుస్తోంది. కానీ మహేష్ బాబు కాకుండా మరో హీరో అయి ఉంటే ఈ సినిమా కూడా ప్లాప్ లెక్కలోనే చేరేది. ఈ మధ్యలో చేసిన సినిమాలలో అసలు కథ ఉందా..! అని వెతికినా దొరకదు. అందుకే, ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కీర్తి సురేశ్ ది బాడ్ స్టొరీ సెలెక్షన్ అయ్యిఉండొచ్చు కానీ, బాడ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ మాత్రం కాదు. 


షి ఈజ్ ఏ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మార్... సో ఆమె ఉండడం ఏ సినిమాకి అయినా కలిసొచ్చే అంశమే అవుతుంది. సర్కారు వారి పాటలో కూడా కీర్తి చాలా అందంగా ఉంది. మహేశ్ అండ్ కీర్తి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ సినిమాతో  తను కంబ్యాక్ హిట్ ఇచ్చినట్లే అనుకుంటున్నారు. చూడాలి మరి ఫైనల్‌గా సర్కారి వారి పాట సినిమాతో కీర్తికి ఎలాంటి క్రెడిబులిటీ దక్కుతుందో. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో చిరుకు చెల్లిగా నటిస్తోంది. అలాగే నాని సరసన దసరా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated Date - 2022-05-15T19:08:06+05:30 IST