Keerthi Suresh: చేసిన తప్పే మళ్లీ చేస్తానంటోంది..!

Twitter IconWatsapp IconFacebook Icon
Keerthi Suresh: చేసిన తప్పే మళ్లీ చేస్తానంటోంది..!

కీర్తి సురేష్ (Keerthi Suresh) ‘మహానటి’ (Mahanati) సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి. ఆ తర్వాత నుండి కీర్తి ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది. ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి. మహానటి తర్వాత కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ని ఎంచుకుంటూ ఫ్లాప్‌లను ఫేస్ చేసింది. ‘పెంగ్విన్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా’ వంటి సినిమాలు ఫ్లాప్‌లను మూటగట్టుకున్నాయి. అయినా కూడా ఈ అమ్మడు అదే తరహా సినిమాలను ఎంచుకుంది. 


ఇక రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)లో కళావతి పాత్రలో మెస్మరైజ్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్, సర్కారు వారి పాట సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందంటూ.. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని చెప్పింది. అయితే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడం తనకి చాలా ఇష్టమని.. అలాంటి కథలు వస్తే తప్పకుండా నటిస్తానంటూ, తన మనసులోని మాటని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. 


అయితే.. ఇప్పుడిప్పుడే కెరీర్ పుంజుకుంటున్న సమయంలో కీర్తి సురేష్, ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కీర్తికి కలిసి రాకపోయినా అవే.. చేస్తాననడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. చేసిన తప్పే.. మళ్లీ మళ్లీ చేస్తుంది అంటూ వాపోతున్నారు. కాగా, ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) చెల్లెలి పాత్ర అయితే, మరొకటి న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాలో హీరోయిన్ పాత్ర.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.