Keerthi Suresh: మహానటి చేయడమే పెద్ద పొరపాటా..?

ABN , First Publish Date - 2022-08-27T15:06:01+05:30 IST

కొందరు స్టార్స్‌కు ఓ భారీ హిట్ కూడా కెరీర్‌ను కష్టాలలోకి లాగేస్తుంది. దీనికి ఉదాహరణగా ఇప్పుడున్న వారిలో కీర్తి సురేష్ (Keerthi Suresh), ప్రభాస్‌ (Prabhas)లను పరిశీలించవచ్చు.

Keerthi Suresh: మహానటి చేయడమే పెద్ద పొరపాటా..?

కొందరు స్టార్స్‌కు ఓ భారీ హిట్ కూడా కెరీర్‌ను కష్టాలలోకి లాగేస్తుంది. దీనికి ఉదాహరణగా ఇప్పుడున్న వారిలో కీర్తి సురేష్ (Keerthi Suresh), ప్రభాస్‌ (Prabhas)లను పరిశీలించవచ్చు. ప్రభాస్‌కు బాహుబలి సిరీస్  (Babubali Siries) పాన్ ఇండియా లెవల్‌లో అసాధారణమైన పాపులారిటీని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అదే రేంజ్ సినిమాలు ఇప్పుడు రాకపోవడమే ప్రభాస్‌కు మైనస్ అవుతూ వస్తోంది. ఇక కీర్తి సురేష్ గురించి కొందరు అనుకున్న మాట, ఆమె కెరీర్ మహానటి సినిమా వల్లే కష్టాల్లో పడిందని.


తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఇక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమా మహానటి (Mahanati). ఈ సినిమా మే 9 2018లో విడుదలైంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో కీర్తి టైటిల్ రోల్ పోషించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కీర్తి సురేష్‌కి ఇండియా మొత్తం మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. 


సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకుంది. అవార్డులు దక్కాయి. ఇంతటి పాపులారిటీ రావడంతో కీర్తి ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేదుకు ఆసక్తి చూపించి ఆ తరహా కథలను ఎంచుకుంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఆ కోవలో వచ్చిన సినిమాలే. కానీ ఇవి కీర్తి షాకిచ్చాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఫ్లాపయ్యాయి. ఇదే క్రమంలో తను నటించిన కమర్షియల్ మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద తిరగబడ్డాయి. చెప్పాలంటే మహానటి సినిమా తర్వాత ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఖాతాలో ఓ భారీ హిట్ చేరింది లేదు. దీనికి కారణం మళ్ళీ అలాంటి కథను తను ఎంచుకోకపోవడమే అని మాట్లాడుకుంటున్నారు. అంటే, కీర్తి కథల ఎంపికలో పొరపాటు చేసిందని అర్థమవుతోంది. ఓ భారీ హిట్ తర్వాత ఓ స్టార్స్ పట్ల అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో..వారిని సంతృప్తి పరచాలంటే ఎంత కష్టమో మహానటి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ చూస్తే తెలుస్తుంది. చూడాలి మరి ఈ మహానటికి ఆ స్థాయి హిట్ ఎప్పుడు దక్కుతుందో.   

Updated Date - 2022-08-27T15:06:01+05:30 IST