Karthikeya 2 : ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే.. !

ABN , First Publish Date - 2022-06-30T17:19:52+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది.

Karthikeya 2 : ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే.. !

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఒక పురాతన దేవాలయం నేపథ్యంలోని హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా అత్యధిక ప్రజాదరణ పొందింది. స్వాతి రెడ్డి (Swathi Reddy) కథానాయికగా నటించిన ఈ సినిమాలోని సస్పెన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకిప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సారి శ్రీకృష్ణ తత్వంపై ఓ మిస్టిక్ స్టోరీని రాసుకున్నాడు దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా ఈ భాగం తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడమే కాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. జూలై 22న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


అయితే ఈ సినిమాకి అదిరిపోయే స్తాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ కు మొత్తం రూ. 34 కోట్ల ధరపలికింది. నిఖిల్ లాంటి మీడియమ్ రేంజ్ హీరోకది అత్యధికం అని చెప్పాలి. ఇంతకు ముందు విడుదలైన ‘కార్తికేయ 2’ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. అందులోని విజువల్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. గుజరాత్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. మొదటి భాగానికి మించి ఈ సినిమా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. 


‘అర్జున్ సురవరం’ (Arjun Suravaram) సినిమా సూపర్ హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది. కీరవాణి (Keeravani) తనయుడు కాలభైరవ (Kaalabhairava) సంగీతం అందిస్తుండగా.. సృజనమణి (Srujanamani) సంభాషణలు రాశారు. అనుపమ్ ఖేర్, ఆదిత్యమీనన్, కేయస్ శ్రీధర్, శ్రీనివాసరెడ్డి, సత్య, ప్రవీణ్, హర్ష చెముడు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ‘కార్తికేయ 2’ చిత్రం మొదటి భాగంలాగానే మ్యాజిక్ చేస్తుందేమో చూద్దాం. 

Updated Date - 2022-06-30T17:19:52+05:30 IST