Punjabi Bahu : ఆ మూడు రోజులు కత్రీనా ఒక్క ముక్క కూడా ఇంగ్లీషు మాట్లాడలేదట!

ABN , First Publish Date - 2021-12-14T17:58:02+05:30 IST

డిసెంబర్ 9న తన చిరకాల ప్రియుడు విక్కీ కౌశల్‌ని పెళ్లాడింది కత్రీనా కైఫ్. అయితే, ఈ బాలీవుడ్ న్యూ వైఫ్ గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. హాంకాంగ్‌లో పుట్టి లండన్‌లో పెరిగిన క్యాట్...

Punjabi Bahu : ఆ మూడు రోజులు కత్రీనా ఒక్క ముక్క కూడా ఇంగ్లీషు మాట్లాడలేదట!

డిసెంబర్ 9న తన చిరకాల ప్రియుడు విక్కీ కౌశల్‌ని పెళ్లాడింది కత్రీనా కైఫ్. అయితే, ఈ బాలీవుడ్ న్యూ వైఫ్ గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. హాంకాంగ్‌లో పుట్టి లండన్‌లో పెరిగిన క్యాట్ మదర్ టంగ్... సహజంగానే ఇంగ్లీష్. ఆమె చాలా వరకూ మీడియా ముందు మాట్లాడేది కూడా అదే. కానీ, కత్రీనా బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో చక్కటి హిందీ నేర్చుకుంది. కానీ, ఆమె అక్కడితో ఆగలేదు. పంజాబీ భాషని కూడా ఓ పట్టుపట్టేసింది!


కత్రీనాకు పంజాబీ భాషతో ఎందుకు అవసరం పడిందంటే విక్కీ కౌశల్ మాతృభాష అదే మరి! కాబోయే భర్త రోజువారి భాషని తాను నేర్చుకోకుంటే ఎలా అనుకుందో ఏమో... పెళ్లికి ముందే ఒంటబట్టించేసుకుంది, పంజాబీ బహు. అదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మురిసిపోతూ వెల్లడించింది డాక్టర్ ఉపాసనా వోహ్రా. ఆమె విక్కీ కౌశల్‌కి కజిన్. ‘‘ఆ మూడు రోజులు (పెళ్లి వేడుకలు జరిగిన సమయంలో) మేమంతా ఒకే ఇంట్లోని ఒకే కుటుంబంలా చక్కగా కలసి పోయాం’’ అందామె! కత్రీనాతో విక్కీ కౌశల్ కుటుంబ సభ్యులకి చాలా వేగంగా చనువు ఏర్పడటానికి కారణం క్యాట్ స్వచ్ఛమైన పంజాబీ మాట్లాడటమేనట! 

Updated Date - 2021-12-14T17:58:02+05:30 IST