బాలీవుడ్ బ్యాచిలర్ బాబుకు విషెస్ తెలిపిన మిసెస్ Katrina..

ABN , First Publish Date - 2021-12-28T00:51:52+05:30 IST

ముంబై గ్లామర్ వరల్డ్‌లో తాను బిగ్ నేమ్‌గా మారటానికి కారణమైన కండల వీరుడికి లండన్ బ్యూటీ కత్రీనా ‘ప్రేమ, వెలుగు, తేజస్సు’ కలగాలని ఆకాంక్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ‘‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి!’’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది...

బాలీవుడ్ బ్యాచిలర్ బాబుకు విషెస్ తెలిపిన మిసెస్ Katrina..

‘న్యూ వైఫ్ ఆఫ్ బాలీవుడ్’ కత్రీనా బర్త్ డే విషెస్ తెలిపింది. ‘మోస్ట్ పాప్యులర్ బాలీవుడ్ బ్యాచిలర్’ సల్మాన్‌కు అంతా
మంచి జరగాలంటూ శుభాకాంక్షలు అందించింది. డిసెంబర్ 27న ‘బజ్రంగీ భాయ్‌జాన్’ 56వ జన్మదినం. దాంతో
సొషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వరద పారింది. బీ-టౌన్ సెలబ్స్ చాలా మంది సల్మాన్‌  కోసం స్పెషల్ మెసేజెస్ పోస్ట్ చేశారు. అయితే, క్యాట్ కూడా తన మెంటార్ అండ్ వెల్ విషర్ సల్మాన్ ఖాన్‌కు ‘‘హ్యపియెస్ట్ బర్త్ డే’’ను విష్ చేసింది...

ముంబై గ్లామర్ వరల్డ్‌లో తాను బిగ్ నేమ్‌గా మారటానికి కారణమైన కండల వీరుడికి లండన్ బ్యూటీ కత్రీనా ‘ప్రేమ, వెలుగు, తేజస్సు’ కలగాలని ఆకాంక్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ‘‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి!’’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. గతంలో ‘పార్ట్‌నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్’ లాంటి సినిమాల్లో భాయ్‌జాన్‌తో రొమాన్స్ చేసిన బ్రిటన్ బ్యూటీ ప్రస్తుతం ‘టైగర్ 3’ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. విక్కీ కౌశల్‌తో పెళ్లి తరువాత కత్రీనా పెద్ద తెరపై కనిపించబోయే తొలి చిత్రం అదే కావచ్చు. ‘ఫోన్ బూత్’ అనే కత్రీనా స్టారర్ థ్రిల్లర్ కూడా క్యూలో ఉంది. చూడాలి మరి క్యాట్ నెక్ట్స్ బిగ్ రిలీజ్ ఏ చిత్రం అవుతుందో...  

Updated Date - 2021-12-28T00:51:52+05:30 IST