Katrina Kaif Sweater Cost: కత్రినా ఇటీవల నెట్టింట పోస్ట్ చేసిన ఫొటో ఇదీ.. ఆమె ధరించిన స్వెటర్ ఖరీదెంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-05T19:46:34+05:30 IST

అందంతోపాటు అభినయంతోనూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి కత్రినా కైఫ్. 2003లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన

Katrina Kaif Sweater Cost: కత్రినా ఇటీవల నెట్టింట పోస్ట్ చేసిన ఫొటో ఇదీ.. ఆమె ధరించిన స్వెటర్ ఖరీదెంతో తెలిస్తే..

అందంతోపాటు అభినయంతోనూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి కత్రినా కైఫ్ (Katrina Kaif). 2003లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ.. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. అందుకే ఈ భామకి ఇన్‌స్టాగ్రామ్‌లో 66 మిలియన్లు అంటే ఆరు కోట్ల ఆరవై లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.


దాంతో.. తరుచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సైతం ఈ భామ ఓ ఫొటోని షేర్ చేసింది. అందులో పలు రంగులు ఉన్న మల్టీకలర్ స్వెటర్‌‌(Sweater)తోపాటు డెనిమ్ జీన్స్ ధరించింది. ఆ పోస్టుకి ‘మార్నింగ్’ అనే క్యాప్షన్‌తోపాటు కాఫీ, పువ్వుల ఎమోజీలు యాడ్ చేసింది. కత్రినా తాజాగా పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఈ పిక్‌కి ఇప్పటికే 13 లక్షలకి పైగా లైకుల వచ్చాయి. అయితే.. అన్నింటికంటే ఎక్కువగా ఆమె స్వెటర్‌ నెటిజన్లు ఆకర్షించింది. దానికి కారణం ఆ స్వెటర్ ఖరీదు. 100% పాలిస్టర్‌తో తయారైన ఆ స్వెటర్ ధర 445 డాలర్లు. అంటే భారతీయ రూపాయలలో దాదాపు రూ.35,000కి సమానం. దాంతో క్యాట్ స్వెటర్ కోసమే అంత ఖర్చు చేసిందా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాకుండా.. క్రతినాని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాకు నువ్వంటే చాలా ఇష్టం కత్రినా’ అంటూ ఒకరు.. ‘మీరు ఈ భూమ్మీద పుట్టిన అందమైన దేవదూత. ఈ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉన్నారు’ అని కామెంట్స్ సైతం చేస్తున్నారు.



Updated Date - 2022-09-05T19:46:34+05:30 IST