విక్కీ కౌశల్, Katrina Kaif రిసెప్షన్ డేట్ ఫిక్స్.. ముంబై‌లో గ్రాండ్‌గా ఈవెంట్..

ABN , First Publish Date - 2021-12-15T23:29:37+05:30 IST

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం

విక్కీ కౌశల్, Katrina Kaif రిసెప్షన్ డేట్ ఫిక్స్.. ముంబై‌లో గ్రాండ్‌గా ఈవెంట్..

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. రిసెప్షన్‌ను వీరు గ్రాండ్‌గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈవెంట్‌కు బాలీవుడ్ సెలెబ్రిటీలందరిని ఆహ్వానించినట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.   


జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో డిసెంబర్ 20న రిసెప్షన్ జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఒమైక్రాన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించిన అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను వీరు పాటించబోతున్నారని తెలుస్తోంది. కత్రినా, విక్కీ సినిమా షూటింగ్‌లల్లో పాల్గొనాల్సి ఉంది. చిత్రీకరణలకు హాజరు కాకముందే పెళ్లి పనులు అన్నింటిని వారు ముగించాలని భావిస్తున్నారు. అందువల్ల ఆ తేదీని ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. 

    

‘‘బాలీవుడ్ సెలెబ్రిటీలైన సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్, రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్‌లకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ప్రస్తుతం ముంబైలో ఒమైక్రాన్ విలయతాండవం చేస్తోంది. అందువల్ల రిసెప్షన్‌కు వచ్చే వారందరూ  ఆర్ టీ-పీసీఆర్ టెస్ట్‌ను తప్పక చేయించుకోవాలి. నెగెటివ్ రిపోర్ట్‌ను తమ వెంట తీసుకురావాలి ’’ అని విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌తో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు.

Updated Date - 2021-12-15T23:29:37+05:30 IST