పెళ్లికి వచ్చిన అతిథులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన విక్కీ కౌశల్, Katrina Kaif.. ఆ బాక్స్‌లో ఏమేం ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2021-12-11T00:28:28+05:30 IST

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌ బర్వరాలో డిసెంబర్ 9న పెళ్లాడారు. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు

పెళ్లికి వచ్చిన అతిథులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన విక్కీ కౌశల్, Katrina Kaif.. ఆ బాక్స్‌లో ఏమేం ఉన్నాయంటే..

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌ బర్వరాలో డిసెంబర్ 9న పెళ్లాడారు. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఆ పెళ్లికి హాజరయిన వారందరూ ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నారు. అతిథులను కొత్తగా పెళ్లయిన జంట వట్టి చేతులతో పంపించడం లేదు. అతిథులందరికి స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను అందజేసింది. ఆ గిఫ్ట్‌లో ఒక మిఠాయి బాక్స్‌తో పాటు స్పెషల్ నోట్ ఉంది. 


‘‘ మా పెళ్లి వేడుకలకి హాజరయినందుకు థ్యాంక్ యూ. మీ హాజరుతో మా వివాహాం ఘనంగా ముగిసింది. మా కలల జీవితాన్ని మేం ప్రారంభించబోతున్నాం. మాకు ఎంతో సరదాగా ఇక్కడ సమయం గడిచింది. మీకు కూడా అలాగే గడించిదని ఆశిస్తున్నాం. ఈ పెళ్లి ప్రారంభం మాత్రమే. మరెన్నో సంబరాలకు మీరు తప్పక హాజరు కావాలి ’’ అని ఆ నోట్‌లో ఉంది. ఈ పెళ్లి వేడుకలు భారీ భద్రత మధ్య ముగిశాయి. అనంతరం తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వేర్వేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.  ఆ ఫొటోల కింద విక్కీ కౌశల్ కామెంట్ కూడా పోస్ట్ చేశాడు. ‘‘ మేం కొత్త బంధాన్ని ప్రారంభించబోతున్నాం. మీరందరూ దీవెనలు, ఆశీస్సులు అందించాలి ’’ అని అతడు రాశాడు. 



Updated Date - 2021-12-11T00:28:28+05:30 IST