Vicky Kaushal తండ్రి తీరుతో అప్‌సెట్.. కత్రినా కైఫ్ ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2021-12-20T18:35:53+05:30 IST

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య..

Vicky Kaushal తండ్రి తీరుతో అప్‌సెట్.. కత్రినా కైఫ్ ఏం చెప్పిందంటే..

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య.. గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు మినీ హానిమూన్‌కి వెళ్లినట్లు కన్‌ఫర్మ్ చేస్తూ మెహందీ పెట్టుకున్న చేతుల పిక్‌ని సైతం పోస్ట్ చేసింది కత్రినా. అయితే తాజాగా తన మామ శ్యామ్ కౌశల్ గురించి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.


సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన ‘ఫాంటమ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కత్రినా. ఇందులో యాక్షన్ సీన్స్‌కి స్టంట్ మాస్టర్‌గా పని చేశాడు ఈ బ్యూటీ మామ, విక్కీ తండ్రి శ్యామ్ కౌశల్. ఆ సినిమాకి సంబంధించి ఓ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతోంది. అందులోని జీపులోని ఉన్న హీరో హీరోయిన్లపై సిరియన్ ఆర్మీ ఎటాక్ చేస్తుంటుంది. దీంతో వారిపై దాడి చేయడానికి సైఫ్ మిషన్ గన్‌ వైపు పరిగెత్తాలి. ఈ పరిస్థితుల్లో హీరోతో పాటు డ్రైవర్ గన్ ఫైర్ చేస్తుండగా.. హీరోయిన్ మాత్రం డోర్ వెనుక దాచుకుంటుంది.


ఎక్స్ రా ఏజెంట్ గన్ ఫైర్ చేయకుండా దాచుకోమని చెప్పిన శ్యామ్ తీరుతో అప్‌సెట్ అయినట్లు కత్రినా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీని గురించి డైరెక్టర్‌కి సైతం కంప్లైంట్ చేసినట్లు ఈ భామ తెలిపింది. ‘డైరెక్టర్ కబీర్‌ఖాన్‌ సెట్‌పైకి రాగానే గన్‌ ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెప్పాను. ఆయన కూడా ఫైట్ సీక్వెన్సులు చేయడానికి నన్ను కూడా అనుమతించమని షామ్ బృందానికి చెప్పాడు. నటికి ఫైటింగ్ సిక్వెన్స్‌లో ఫైరింగ్‌కి గన్ ఇవ్వకపోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. కానీ ఈ సారి అలా జరిగేందుకు నేను గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాన’ని ఈ బ్యూటీ చెప్పింది.

Updated Date - 2021-12-20T18:35:53+05:30 IST