పెళ్లయ్యాక మొట్టమొదటిసారి అత్తారింట్లో Katrina Kaif వంట.. రుచి చూసిన భర్త విక్కీ కౌశల్ రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-12-18T01:14:21+05:30 IST

కత్రినా కైఫ్ తొలిసారిగా అత్తారింట్లో వంట వండింది. ఒక స్వీట్‌ను వండి తన అత్తింటి వారికి రుచి చూపించింది. ఆ వంటకాన్ని రుచి

పెళ్లయ్యాక మొట్టమొదటిసారి అత్తారింట్లో Katrina Kaif  వంట.. రుచి చూసిన భర్త విక్కీ కౌశల్ రియాక్షన్ ఇదీ..!

కత్రినా కైఫ్ తొలిసారిగా అత్తారింట్లో వంట వండింది. ఒక స్వీట్‌ను వండి తన అత్తింటి వారికి రుచి చూపించింది. ఆ వంటకాన్ని రుచి చూసిన విక్కీ కౌశల్ రియాక్షన్  ఇచ్చాడు.


కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బాలీవుడ్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో డిసెంబర్ 9న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ జంట రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఈ వేడుక డిసెంబర్ 20న జరగబోతున్నట్టు తెలుస్తోంది. బీ టౌన్ సెలబ్రిటీలందరిని ఈ ఫంక్షన్ కు ఆహ్వానించినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


కత్రినా అత్తింటి ఆచారాలు అన్నింటిని పాటిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లిలోను‌ పంజాబీ సంప్రదాయం ఉట్టి పడేలా ఆమె దుస్తులు ధరించింది. తన తొలి వంటకాన్ని కత్రినా మెట్టింట్లో వండింది. విక్కీ కౌశల్, అతడి తల్లిదండ్రులకు తన వంట రుచిని చూపించడం మొదలుపెట్టింది. మొదటి‌సారిగా షీరా అనే స్వీట్‌ను ఆమె వండింది. ఆ వంటకానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అభిమానులతో పంచుకుంది. మైనే బనాయా (నేను చేశాను) అనే కామెంట్‌ను ఆ ఫొటో కింద రాసింది.  దీంతో ఆ ఫోటోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వంటకాన్ని విక్కీ కౌశల్ రుచి చూశాడు. ‘‘ జీవితంలో తిన్న అద్భుతమైన హల్వా ’’ అంటూ కామెంట్ చేశాడు. 


Updated Date - 2021-12-18T01:14:21+05:30 IST