కత్రినా, విక్కీలు మమల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు..? కండోమ్ కంపెనీ వైరల్ పోస్ట్..

ABN , First Publish Date - 2021-12-10T01:56:38+05:30 IST

కత్రినా పెళ్లి వైరల్ అవుతున్న కండోమ్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

కత్రినా, విక్కీలు మమల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు..? కండోమ్ కంపెనీ వైరల్ పోస్ట్..

ఇంటర్నెట్ డెస్క్: కత్రినా, విక్కీ కౌశల్‌ల పెళ్లి ప్రస్తుతం టాక్ ఆఫ్ ధి టౌన్. ఇప్పుడు అందరి దృష్టీ ఈ పెళ్లి వేడుకపైనే. కానీ.. విక్కీ, కత్రినాలు మాత్రం తమ వివాహం విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. వారు తమ వివాహానికి చాలా తక్కువ మంది అతిథులనే ఆహ్వానించారు. ఇక పెళ్లికి వచ్చే వారు సెల్ ఫోన్లు తీసుకురాకూడదని, ఇక్కడి విషయాలు బయటకు లీక్ చేయకూడదంటూ సవాలక్ష కండీషన్లు పెట్టారు. ఇది చాలదన్నట్టు.. అతిథులతో ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు కూడా తీసుకున్నారన్న ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఆ మాటకొస్తే.. విక్కీ-కత్రినాల ప్రేమ వ్యవహారం.. మొదటి నుంచీ అంతా సీక్రెసీనే. తమ రిలేషన్‌కు సంబంధించిన ఏ విషయాన్నీ కూడా వారు బయటకుపొక్కనీయ లేదు. అడపాదడపా వారు జంటగా దిగిన ఏదోక ఫొటో వైరల్ కావడం..దీనిపై మీడియాలో ఓ  ‘ప్రేమ’వార్త రావడం మినహా.. వారెప్పుడూ అసలు విషయం ఇదీ అని స్పష్టం చేయలేదు. సరే..ఇదంతా గతం.. ఇప్పుడు వారి పెళ్లి కూడా చేసేసుకున్నారు.. పెళ్లి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. DelhiTimes ఆ ఫొటోల్ని ట్వీట్ చేసింది కూడా..


మరి కొత్తగా పెళ్లైన జంటలు తొలినాళ్లలో లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటాయి. తమ మధ్య ఉన్న మానసిక బంధం మరింతగా బలపడాలనుకుంటాయి. ఈ క్రమంలో పిల్లలు కనడం వంటి విషయాలను కొంత కాలం పాటు వాయిదా వేయడం సహజంగా జరిగేదే. దీనికి కత్రినా-విక్కీ జంట కూడా మినహాయింపు కాదు. అయితే.. యువజంటలకు ఉండే ఈ అభిలాష ఆధారంగానే ప్రముఖ కండోమ్‌ల కంపెనీ డ్యూరెక్స్ కత్రినా-విక్కీలను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కాబోయే వధూవరులకు ఓ వైపు శుభాకాంక్షలు చెబుతూనే డ్యూరెక్స్ తనదైన శైలిలో చమత్కారపు కామెంట్ వదలింది. కత్రినా-విక్కీల వివాహం చుట్టూ నెలకొన్న సీక్రెసీని కూడా పరోక్షంగా ప్రస్తావించింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముదంటే.. డియర్ విక్కీ, కత్రినా.. మీరు మమ్మల్ని పెళ్లికి పిలవలేదా..? మేం అస్సలు నమ్మలేకపోతున్నాం(Kidding)..? అన్న అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. ఈ Kidding అనే పదం ద్వారానే డ్యూరెక్స్ తనదైన హాస్యాన్ని జోడించింది. ఆంగ్లంలో ‘Kidding’ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి నమ్మశక్యం కానిది అనే అర్థమైతే..రెండో అర్థం.. ‘పిల్ల చేష్టలు లేదా ఆటకాయితనం’ అని.  దీంతో.. ‘పిల్ల చేష్టలు’ పదాల్లోని అసలు శ్లేషను పసిగట్టిన నెటిజన్లు తెగనవ్వుకుంటున్నారు. అయితే..డ్యూరెక్స్ అక్కడితో ఆగలేదు..! ‘మా చమత్కారాన్ని అర్థం చేసుకుని..పెళ్లికి ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాం’ అనే అర్థం వచ్చేలా మరింత డైరెక్ట్‌ కామెంట్ పెట్టింది. అందుకే.. ఈ పోస్ట్ ఇంతలా వైరల్ అవుతోంది. 





Updated Date - 2021-12-10T01:56:38+05:30 IST