Katrina Kaif: స్కూల్ పిల్లలతో హీరోయిన్ డ్యాన్స్

ABN , First Publish Date - 2022-09-27T00:13:20+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తుంది. తాజాగా స్కూలు పిల్లలతో కలసి కత్రినా

Katrina Kaif: స్కూల్ పిల్లలతో హీరోయిన్ డ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తుంది. తాజాగా స్కూల్ పిల్లలతో కలసి కత్రినా డ్యాన్స్ చేసింది. ‘బీస్ట్’ లోని ‘అరబిక్ కుతు’ (Arabic Kuthu) కు స్టెప్పులేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కత్రినా అభిమానులుందరు విపరీతంగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.  


తమిళనాడు మధురైలోని మౌంటెన్ వ్యూ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా కైఫ్ పాల్గొంది. కాసేపు విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం పిల్లలతో కలసి పాపులర్ సాంగ్ ‘అరబిక్ కుతు’ కు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను కత్రినా అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 96వేల వీక్షణలు, 5వేల లైక్స్ వచ్చాయి. నెటిజన్స్ అందరు వీడియో కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఆమె క్యూట్‌గా ఉందని ఓ నెటిజన్ తెలిపారు. ఆమె అద్భుతమైన మనిషి అని మరో నెటిజన్ చెప్పారు.    


రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా మౌంటెన్ వ్యూ స్కూల్‌ను స్థాపించారు. పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలను బోధించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. కత్రినా కైఫ్ తల్లి సుజనే ఈ స్కూల్‌లో కొన్ని రోజులు పాఠాలను బోధించింది. గతంలో కత్రినా కైఫ్ ఈ పాఠశాలకు నిధులు అందించాలని కోరింది. తరగతి గదులను నిర్మించేందుకు ఆ నిధులను ఉపయోగిస్తామని చెప్పింది. ఇక కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘టైగర్-3’ (Tiger-3) షూటింగ్‌ను పూర్తి చేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈద్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘మెర్రి క్రిస్‌మస్’, ‘ఫోన్ బూత్’ వంటి సినిమాల్లోను నటిస్తుంది. ఫోన్ బూత్ లో ఇషాన్ ఖట్టర్, సిద్దాంత్ చతుర్వేది కీలక పాత్రలు పోషిస్తున్నారు. 





Updated Date - 2022-09-27T00:13:20+05:30 IST