తెరపై సందడి చేయనున్న Katrina Kaif, విక్కీ కౌశల్

ABN , First Publish Date - 2021-12-18T01:55:12+05:30 IST

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బీ టౌన్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం

తెరపై సందడి చేయనున్న Katrina Kaif, విక్కీ కౌశల్

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బీ టౌన్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం డిసెంబర్ 9న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ జంట రిసెప్షన్‌ను డిసెంబర్ 20న ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బీ టౌన్ సెలెబ్రిలందరినీ ఈ వేడుకకు ఆహ్వానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 


ఈ జంట ఇప్పటికే కొన్ని కమర్షియల్స్‌‌కు సంతకం చేసినట్టు తెలుస్తోంది. లగ్జరీ బ్రాండ్‌లకు చెందిన ఆరోగ్యకర ఉత్పత్తులకు ఈ జంట ప్రచారం చేయబోతున్నట్టు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ యాడ్‌ల షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె, అనుష్క శర్మ-విరాట్ కోహ్లి దంపతులు అనేక కమర్షియల్స్‌ల్లో కలిసి నటించారు. తాజాగా కొత్తగా పెళ్లైయిన జంట వీరి బాటలోనే నడవబోతున్నారని వినికిడి. 


కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ తమ పెళ్లికి సంబంధించిన వీడియో టెలికాస్ట్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కు భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా రూ. 80కోట్లు చెల్లించి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. 

Updated Date - 2021-12-18T01:55:12+05:30 IST