వీళ్ల రూటే సపరేటు.. పెళ్లి మంటపంలో ఈ సెలబ్రెటీల నిర్ణయాలను చూసి అవాక్కైన బంధువులు, ఫ్యాన్స్..!

ABN , First Publish Date - 2021-12-16T21:03:18+05:30 IST

పాత సంప్రదాయం... కొత్త ఆచారం... ప్రస్తుతం బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగ్స్‌లో ఇదే కొనసాగుతోంది. ఇంతకీ, పాత సంప్రదాయం ఏంటి? కొత్త ఆచారం ఏంటి? అంటారా...

వీళ్ల రూటే సపరేటు.. పెళ్లి మంటపంలో ఈ సెలబ్రెటీల నిర్ణయాలను చూసి అవాక్కైన బంధువులు, ఫ్యాన్స్..!

పాత సంప్రదాయం... కొత్త ఆచారం... ప్రస్తుతం బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగ్స్‌లో ఇదే కొనసాగుతోంది. ఇంతకీ, పాత సంప్రదాయం ఏంటి? కొత్త ఆచారం ఏంటి? అంటారా... 


డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటైన కత్రీనా, విక్కీ కౌశల్ గత కొన్ని రోజులుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. అయితే, అందరి దృష్టి వారిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఏర్పాట్లపైన, విందులపైన కేంద్రీకృతం అయింది. ఎవరూ పెద్దగా వారి పెళ్లిలో పాటించిన ఆచారసంప్రదాయాల గురించి పట్టించుకోలేదు.  కానీ, ఒక్క విషయం మాత్రం పూర్తిగా స్పష్టం...  కత్రీనా హాంకాంగ్‌లో పుట్టి, లండన్‌లో పెరిగినా... సంపూర్ణంగా భారతీయ సంప్రదాయం ప్రకారమే ఏడు అడుగులు వేసింది. పంజాబీ పద్ధతిలో విక్కీ కౌశల్ జీవితంలోకి కుడి కాలు పెట్టేసింది... 


మిసెస్ కత్రీనా మనస్ఫూర్తిగా మన సంప్రదాయం అయితే పాటించింది కానీ ఓ ఆచారం మాత్రం కాస్త విభిన్నంగా అమలు చేసింది. ఉత్తరాది వివాహల్లో పెళ్లి కూతురు మంటపంలోకి వచ్చేప్పుడు ఆమె తలపై పూలతో చేసిన పందిరిని అలంకారంగా పట్టుకుంటారు. ఈ పని సాధారణంగా చేసేది వధువు తరుఫు అన్నదమ్ములు. కానీ, విక్కీ కౌశల్ వివాహ వేడుక వేళ... కత్రీనా యువరాణిలా నడిచి వస్తోంటే  ‘ఫూలోంకా చాదర్’ పట్టుకున్నది ఎవరో తెలుసా? ఆమె అరుగురు సోదరీమణులు! అలా అబ్బాయిల చేత కొనసాగాల్సిన ఆచారం అమ్మాయిల చేత చేయించేసింది కత్రీనా!


ఈ మధ్య కాలంలో ఆచారానికి ప్రతిగా కొత్త ఆచారం తీసుకొచ్చిన బాలీవుడ్ జంట మరొకటి ఉంది. వారే... రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ. వీరిద్దరు కూడా కొన్నాళ్ల క్రిందటే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే, భర్త రాజ్ కుమార్ పెళ్లి తరువాత పత్రలేఖ నుదుటన సింధూరం దిద్దాడు. అది ఎప్పుడూ జరిగేదే అనుకున్నారో ఏమో... మిసెస్ పత్రలేఖ తిరిగి తన శ్రీవారి నెత్తిన సింధూరం అలంకరించేసింది! నిజానికి ఆమెని తన తలపై సింధూరం పెట్టమని అడిగి మరీ దిద్దించుకున్నాడు రాజ్‌ కుమార్ రావ్! 


మాజీ బ్యూటీ క్వీన్ దియా మీర్జా కూడా తన పెళ్లి వేళ వార్తల్లో నిలిచింది. సంప్రదాయ బద్ధంగానే అంతా జరిగినప్పటికీ ‘కన్యాదానం, అప్పగింతలు’ లిస్టులోంచి పక్కకు తప్పుకున్నాయి. ఆ రెండు వ్యవహారాలు దియా మీర్జాకు నచ్చలేదట. అమ్మాయిని ‘దానం’ చేయటం ఏంటని ఆమె ఫీలైంది. అలాగే, పెళ్లైనంత మాత్రాన తల్లిదండ్రులు ‘అప్పగిం‘చేస్తారా... అని ప్రశ్నించింది సొషల్ మీడియాలో. అందుకే, ఆధునిక మహిళగా ఆ రెండు పాత పద్ధతుల్ని దియా క్యాన్సిల్ చేసేసింది. మరో కొత్త కోణం కూడా ఆమె తన పెళ్లిలో ఆవిష్కరించింది. దియా మీర్జా వివాహం పురోహితుడు చేయించలేదు! పురోహితురాలు... అదేనండీ, లేడీ ప్రీస్ట్ నిర్వహించారు!                                                                                                                                                                                                                                

Updated Date - 2021-12-16T21:03:18+05:30 IST