Katrina Kaif, విక్కీ కౌశల్ ఉండబోయే కొత్త ఇంటిని చూశారా..? అదే భవనంలో ఇప్పటికే ఉంటున్న సెలబ్రెటీ జంట ఎవరో తెలిస్తే...

ABN , First Publish Date - 2021-12-20T01:36:46+05:30 IST

ప్రచారాలు, పుకార్ల తుఫాను వెలిసింది. కత్రీనా, విక్కీ కౌశల్ దంపతులైపోయారు. రాజస్థాన్‌లో జరిగిన రాయల్ వెడ్డింగ్ తరువాత కొత్త జంట ముంబైకి తిరిగి వచ్చేశారు కూడా. నెక్ట్స్ ఇక మిష్టర్ అండ్ మిసెస్ కౌశల్ తమ తమ షూటింగ్స్‌కి వెళ్లటమే మిగిలి ఉంది. మరి పనిలో పడిపోక ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా? విక్కీ, క్యాట్ అదే చేశారు. తాజాగా తమ కొత్త కలల సౌధంలోకి కాలు మోపారు. గృహ ప్రవేశం తంతు ముగించి ముంబైలోని జుహూలో తమ కొత్త కాపురం మొదలెట్టారు...

Katrina Kaif, విక్కీ కౌశల్ ఉండబోయే కొత్త ఇంటిని చూశారా..? అదే భవనంలో ఇప్పటికే ఉంటున్న సెలబ్రెటీ జంట ఎవరో తెలిస్తే...

ప్రచారాలు, పుకార్ల తుఫాను వెలిసింది. కత్రీనా, విక్కీ కౌశల్ దంపతులైపోయారు. రాజస్థాన్‌లో జరిగిన రాయల్ వెడ్డింగ్ తరువాత కొత్త జంట ముంబైకి తిరిగి వచ్చేశారు కూడా. నెక్ట్స్ ఇక మిష్టర్ అండ్ మిసెస్ కౌశల్ తమ తమ షూటింగ్స్‌కి వెళ్లటమే మిగిలి ఉంది. మరి పనిలో పడిపోక ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా? విక్కీ, క్యాట్ అదే చేశారు. తాజాగా తమ కొత్త కలల సౌధంలోకి కాలు మోపారు. గృహ ప్రవేశం తంతు ముగించి ముంబైలోని జుహూలో తమ కొత్త కాపురం మొదలెట్టారు...

‘రాజ్‌మహల్’... శ్రీమతి కత్రీనా కుడి కాలుమోపిన ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ముంబైలోని జుహూ ఏరియాలో ఉంది. ధనవంతులు, సెలబ్రిటీలు నివాసముండే ఈ బిల్డింగ్‌లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ తన భర్త, కూతురుతో ఉంటోంది. ‘రాజ్‌మహల్’ అపార్ట్మెంట్‌లో విరాట్ కోహ్లీకి రెండు అంతస్థులున్నాయి. కాగా ఇప్పుడు అదే భవనంలో ఎనిమిదో అంతస్థు విక్కీ అద్దెకు తీసుకున్నాడు. కత్రీనాతో కలసి రానున్న కొన్నేళ్ల పాటూ అతను అక్కడే ఉండటానికి ప్లాన్ చేశాడు.

విరాట్, అనుష్కా శర్మ లాంటి హైప్రొఫైల్ సెలబ్స్ ఉంటోన్న బంగళాలో చోటు సంపాదించటం ఖరీదైన వ్యవహారమే. అందుకే, విక్కీ కౌశల్ తన ఫ్లాట్ కోసం 1.75 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాడట. ఇక నెలనెలా 8 లక్షలు రెంట్ కట్టబోతున్నాడు. మొత్తం 5 ఏళ్ల కోసం అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నారు కత్రీనా, విక్కీ. అందులో మొదటి 36 నెలలు 8 లక్షలు రెంట్. తరువాత సంవత్సరం పాటూ 8.40 లక్షలు ప్రతీ నెల చెల్లిస్తారు. ఆ తరువాత లాస్ట్ ఇయర్‌లో ఎవ్రీ మంత్ 8.82 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందట. ముంబైలోని జుహూ లాంటి ప్రాంతంలో ఆ మాత్రం ధర మామూలు విషయమే కదా...  



Updated Date - 2021-12-20T01:36:46+05:30 IST