Kartik Aaryan: నీ మాజీ ప్రేయసి ఎదురుపడితే ఏం చేస్తావ్.. అని కార్తిక్ ఆర్యన్‌ను అడిగితే..

ABN , First Publish Date - 2022-07-25T21:44:59+05:30 IST

ఎటువంటి అండదండలు లేకుండా బాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). తాజాగా ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2)లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన

Kartik Aaryan: నీ మాజీ  ప్రేయసి ఎదురుపడితే ఏం చేస్తావ్.. అని కార్తిక్ ఆర్యన్‌ను అడిగితే..

ఎటువంటి అండదండలు లేకుండా బాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). తాజాగా ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2)లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌(Sara Ali Khan) తో డేటింగ్ చేస్తున్నాడని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) షోలో సారా అలీ ఖాన్ పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్(Karan Johar), కార్తిక్ గురించి ప్రస్తావించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా ‘‘నీ ఎక్స్, ఎక్స్ లా ఎందుకు మారాడు’ అని కరణ్ అడిగాడు. అందుకు సారా..‘‘అతడు ప్రతి ఒక్కరి ఎక్స్’’ అని చెప్పింది. 


కార్తిక్ ఆర్యన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, సారా అలీ ఖాన్‌లకు కౌంటర్ ఇచ్చాడు. ఏ విషయాన్ని చూసి గర్విస్తారని యాంకర్ అడగగా కార్తిక్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ర్యాపిడ్ ఫైర్ షోలతో పాపులర్ కావడంతో గర్విస్తున్నానని చెప్పాడు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లోనే.. ’‘అవార్డ్స్ షోలో మీ మాజీ ప్రేయసీ ఎదురుపడితే మీరు ఏం చేస్తారు’’ అని యాంకర్ అడిగాడు. ‘‘ఆమెతో మర్యాదగా ప్రవర్తిసాను’’ అని కార్తిక్ చెప్పాడు. కొన్ని రోజుల క్రితమే ఈ స్టార్ నటుడు ఓ అవార్డ్స్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సారాతో కలసి ఫోజులిచ్చాడు. ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ ‘షెహజాదా’ (Shehzada)లో నటిస్తున్నాడు. టాలీవుడ్ హిట్ చిత్రం ‘అల వైకుంఠపురంలో’ కి రీమేక్‌గా ఇది రూపొందుతోంది.

Updated Date - 2022-07-25T21:44:59+05:30 IST