Kartik Aaryan: అతను అందరికీ మాజీ ప్రియుడంటూ సారా అలీఖాన్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-07-25T14:46:34+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. ముఖ్యంగా..

Kartik Aaryan: అతను అందరికీ మాజీ ప్రియుడంటూ సారా అలీఖాన్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. ముఖ్యంగా ఈ కుర్ర హీరోకి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కార్తీక్ కోసం కొందరు అమ్మాయిలు ఆయన ఇంటిముందు గోల చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం. అయితే.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ నటుడి ప్రస్తావన వచ్చింది. కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేసే ఈ షోకి సారా అలీఖాన్ (Sara Ali Khan), జాన్వీ కపూర్ అతిథులుగా వచ్చారు.


ఆ షోలో భాగంగా జరిగిన ర్యాపిడ్ ఫైర్‌లో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)ని, సారాని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు కరణ్. ముఖ్యంగా సారాని.. ‘నీ మాజీ ప్రియుడు ఎందుకు మాజీ ప్రియుడు అయ్యాడు?’ అని కరణ్ అడిగాడు. దానికి సారా.. ‘ఎందుకంటే అతని చాలామందికి మాజీ ప్రియుడు కాబట్టి’ అని వెటకారంగా సమాధానం ఇచ్చింది. సారా, కార్తీక్ మధ్య ఎఫైర్ నడిచినట్లు ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. అలాగే.. ఈ షోలోనే కరణ్ సైతం వారి బంధం గురించి మాట్లాడాడు. దీంతో సారా వ్యాఖ్యలు కార్తీక్ గురించేనంటూ నెట్టింట చర్చలు జరిగాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ స్పందించాడు.


అందులో.. ‘మీరు గర్వపడే ఓ విషయాన్ని చెప్పండి’ అని కార్తీక్‌ని యాంకర్ అడిగాడు. దానికి సమాధానంగా.. ‘ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్‌లో నాపేరు వినిపించడం గర్వంగా అనిపిస్తోంది’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కార్తీక్ కామెంట్స్‌పై పలువురు నెటిజన్లు స్పందింస్తున్నారు. ‘ఇది సారా గురించి కావొచ్చు’ అని కొందరు.. ‘సరైన రిప్లై’ అంటూ మరికొందరు.. ‘రూమర్స్ రావడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కాదు.. సరైన సమాధానం’ అని ఇంకొందరు రాసుకొచ్చారు. కాగా.. కార్తీక్ ప్రస్తుతం టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిమేక్ ‘షాహజాదా’లో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ ఓ నిర్మాతగా ఉన్న ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.



Updated Date - 2022-07-25T14:46:34+05:30 IST