Karthikeya-2: ట్విట్టర్ రివ్యూ..

ABN , First Publish Date - 2022-08-13T14:31:45+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameshwan) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’ (Karthikeya-2).

Karthikeya-2: ట్విట్టర్ రివ్యూ..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameshwan) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’ (Karthikeya-2). తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే, యూఎస్ సహా పలుచోట్ల ప్రీమియర్ షోస్‌ను ప్రదర్శించారు. ఈ మూవీ చూసిన అభిమానులు, నెటిజన్స్ తమ రివ్యూను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. మరి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.


‘కార్తికేయ 2’ ఓవరాల్‌గా బాగుంది. స్టోరీ చాలాతా ఇంట్రెస్టింగ్‌ సాగుతుంది. థ్రిల్‌ ఫ్యాక్టర్‌ తక్కువగా ఉన్నా కూడా  టీమ్‌ మొత్తం మంచి ప్రయత్నం చేశారు. అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఫస్టాఫ్‌ బాగుంది. కాలభైరవ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగా అందించారు. అసలు కథ సెకండాఫ్‌ లోనే ఉంటుంది.. అని మరో నెటిజన్ ట్వీట్‌ చేశాడు. 



చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌  నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. మరి సినిమాకి మార్నింగ్ షోస్ పూరత్య్యాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.


మరికొందరు ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ చాలా బాగుంది.. దర్శకుడు చందూ మొండేటి కథ హ్యండిల్‌ చేసిన విధానం బాగుంది.. అంటున్నారు. విజువల్స్, గ్రిప్పింగ్ నేరేషన్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయని కామెంట్‌ చేస్తున్నారు. కార్తికేయ - 2  హిట్‌ లేదా ఎబోవ్ యావరేజ్, మొత్తంగా మరో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నప్పటికీ ఇంటర్వెల్ నుంచి బాగుంది..అని రేటింగ్ 2.75 - 3 5 అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. 









Updated Date - 2022-08-13T14:31:45+05:30 IST