Karthikeya 2: నిఖిల్ అభ్యర్థన ఏంటంటే..?

ABN , First Publish Date - 2022-08-14T15:38:12+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన తాజా చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.

Karthikeya 2: నిఖిల్ అభ్యర్థన ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటించిన తాజా చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. అయినా కూడా 'ప్లీజ్ థియేటర్స్ పెంచండి' అని అభ్యర్థిస్తున్నాడు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కార్తికేయ చిత్రానికి కొనసాగింపుగా వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించింది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.


రాజమౌళి (Rajamouli), రవితేజ (Raviteja) సహా పలువురు సినీ తారలందరూ ఈ సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. యూనిట్ ఈ సినిమా కోసం రెండేళ్ళపాటు శ్రమించింది. వారి శ్రమ ఫలించి హిట్ సాధించింది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాకు మరిన్ని థియేటర్స్ కేటాయిస్తే వసూళ్ళ పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు తక్కువ థియేటర్స్ కేటాయించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రను పోషించారు. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.


ఇక ఇదే వారం హిందీలో విడుదలైన లాల్ సింగ్ చడ్డా - రక్షా బంధన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. కానీ, కార్తికేయ 2కి మాత్రం అన్నీ ప్రాంతాలలో పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర హీరో నిఖిల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రిక్వెస్ట్ చేశాడు. "కార్తికేయ2 హిందీలో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. దయచేసి హిందీలో షోలను పెంచండి అని పీవీఆర్ సినిమాస్.. ఐనాక్స్ మూవీస్ ని అభ్యర్థిస్తున్నాను" ..అని ట్వీట్‌లో రిక్వెస్ట్ చేశాడు. మరి మన నిఖిల్ కోరిక మేరకు థియేటర్స్‌ను ఎంతవరకు పెంచుతారో చూడాలి. 



Updated Date - 2022-08-14T15:38:12+05:30 IST