యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి (Chandu Mondeti) దర్వకత్వంలో.. పురాతన దేవాలయం బ్యాక్ డ్రాప్‌లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది చిత్రం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకృష్ణ తత్వంపై రెండో భాగం మరింత ఆసక్తికరంగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్‌లో విడుదల కానుంది.
తాజాగా ‘కార్తికేయ 2’ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీ పార్టనర్స్ జీ5 (Zee 5) అని తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత దానికి వచ్చిన టాక్ ను బట్టి.. ‘కార్తికేయ 2’ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలయ్యేది.. అధికారికంగా ప్రకటిస్తారు. మొదటి భాగంలాగనే ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే. ఓటీటీలోకి.. ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు సమావేశంలో సూచించిన మేరకు.. 50 రోజుల గ్యాప్ తో వస్తుందని సమాచారం. ఒకవేళ సినిమాకి ఆశించిన రిజల్ట్ రాకపోతే.. కాస్త ముందే సినిమా ఓటీటీలో ప్రత్యక్షం అవుతుంది. ‘అర్జున్ సురవరం’ (Arjun Suravaram) సూపర్ హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ‘కార్తికేయ 2’ పై మంచి హైపు క్రియేట్ అయింది.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher) ప్రధాన పాత్ర చేస్తుండగా.. సత్య, శ్రీనివాసరెడ్డి, హర్ష, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి (Keeravani) తనయుడు కాలభైరవ (Kaava Bharava) సంగీతం అందిస్తుండగా.. కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఛాయాగ్రహణం, ఎడిటింగ్ నిర్వహిస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రూ. 34కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ నిఖిల్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడతుందో చూడాలి.