Karthikeya 2 : హిందీ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్స్ !

ABN , First Publish Date - 2022-08-14T18:55:23+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha), మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

Karthikeya 2 : హిందీ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్స్ !

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha), మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిన్ననే (ఆగస్ట్ 13న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘కార్తికేయ’ మొదటి భాగం సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో అనూహ్య సంఘటనలతో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కితే.. రెండో భాగం సముద్రగర్భంలో కలిసిపోయిన ద్వారాకా నగరం, శ్రీకృష్ణుని తత్వంపై ఆసక్తికరంగా రూపొందింది. శ్రీకృష్ణుని కాలి పట్టీని అన్వేషిస్తూ కథానాయకుడు కార్తికేయ సాగించే సాహస యాత్ర, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తున్నాయి. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదలైంది. 


అయితే అనూహ్యంగా ‘కార్తికేయ 2’ హిందీ వెర్షన్ కు భారీ డిమాండ్ ఏర్పడడం విశేషం. బాలీవుడ్ లోని హిందీ సినిమాలకంటే.. ఈ సినిమాకే షోస్ ఫుల్ అవుతుండడం, పైగా ఆక్యుపెన్సీ కూడా వాటికన్నా దీనికే ఎక్కువవడం ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. హిందీ మార్కెట్‌ను ‘కార్తికేయ 2’ చిత్రం కొల్లగొడుతుండడం మనకు గర్వకారణం అని చెప్పాలి. దాంతో థియేటర్స్‌ను పెంచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.  హిందీ వెర్షన్ కు వచ్చిన రెస్పాన్స్‌కు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు హీరో నిఖిల్. టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్ లోనూ ‘కార్తికేయ 2’ భారీ వసూళ్లను రాబడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 


నిఖిల్ గత చిత్రం ‘అర్జున్ సురవరం’ (Arjun  Suravaram) పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత ‘18 పేజెస్’ (18 Pages) అనే మూవీలో నటించినప్పటికీ.. ‘కార్తికేయ 2’ ను ప్రయారిటీలో పెట్టాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా ముందు విడుదల చేయాలని.. ఎంతో కష్టపడి షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే విడుదల మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఇతర సినిమాలతో క్లాష్ కాకూడదనే ఉద్దేశంతో రెండు సార్లు విడుదల తేదీలు మార్చుకున్నాడు నిఖిల్. చిత్రం విడుదలయ్యాకా పడికష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చిత్ర బృందం భావిస్తోంది. మరి ‘కార్తికేయ 2’ చిత్రం హిందీ మార్కెట్లో ఏ స్థాయిలో వసూళ్ళు కురిపిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-08-14T18:55:23+05:30 IST