Karthikeya 2: నిఖిల్ సినిమాకు బాలీవుడ్‌లో షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2022-08-20T22:36:24+05:30 IST

హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహించాడు

Karthikeya 2: నిఖిల్ సినిమాకు బాలీవుడ్‌లో షాకింగ్ కలెక్షన్స్

హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2)  తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలను పంచి పెట్టింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద సైతం ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ భారీ వసూళ్లను రాబడుతుంది. 


హిందీ బెల్ట్‌లో ‘కార్తికేయ-2’ ఆగస్టు 19న భారీ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శుక్రవారం నాడు రూ. 2.46కోట్ల వసూళ్లను రాబట్టింది. హిందీ చిత్రాల కంటే అధికంగా ఈ కలెక్షన్స్ ఉండటం గమనార్హం. మొదటి వారంలో ఈ చిత్రం రూ. 8.21కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. రాబోయే రోజుల్లోను ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్‌లో ఆగస్టు 11న రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా థియేటర్స్‌కు వెళ్లాలనుకునేవారికీ ‘కార్తికేయ’ హిందీ వెర్షన్‌ మొదటి ఛాయిస్‌గా నిలుస్తుంది.



Updated Date - 2022-08-20T22:36:24+05:30 IST