Karthikeya 2: ఈసారి వీడియో సాంగ్‌.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-07-12T02:54:26+05:30 IST

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి ద‌ర్శక‌త్వంలో.. ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’ (Karthikeya 2). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది

Karthikeya 2: ఈసారి వీడియో సాంగ్‌.. ఎప్పుడంటే?

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి ద‌ర్శక‌త్వంలో.. ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’ (Karthikeya 2). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్.. మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింతగా అంచనాలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వీడియో సాంగ్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తాజాగా సాంగ్ విడుదలకు సంబంధించిన వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘నన్ను నేను అడిగా’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ను జూలై 12 సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు జీ మ్యూజిక్ సౌత్ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.


క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. ట్రైలర్ గమనిస్తే..  శ్రీకృష్ణుడు చ‌రిత్రలోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఆయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల క‌ళ్ళకు క‌ట్టిన‌ట్టు చూపించారు. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. జూలై 22న ప్రపంచ‌ వ్యాప్తంగా గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-07-12T02:54:26+05:30 IST