Karthikeya 2 : విడుదల తేదీ మళ్ళీ మారింది !

ABN , First Publish Date - 2022-08-03T20:05:56+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కార్తికేయ 2’. సూపర్ హిట్ ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీనివాసరెడ్డి, వైవా హర్షా, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Karthikeya 2 : విడుదల తేదీ మళ్ళీ మారింది !

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తుండగా.. శ్రీనివాసరెడ్డి, వైవా హర్షా, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకృష్ణ తత్వం నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా రూపొందినట్టు నిర్మాతలు తెలిపారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా వేసుకుంది. ఈ నెల 12న విడుదల కావాల్సి ఉండగా.. దీన్ని ఒక రోజు ఆలస్యంగా అంటే 13న విడుదల చేయబోతున్నట్టు హీరో నిఖిల్ మీడియా ముఖంగా తెలిపాడు.


‘కార్తికేయ 2’ చిత్రం విడుదల గురించి నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యకరమైన వాతావరణం కోసమే ఒకరోజు లేట్ గా థియేటర్స్ కు వస్తున్నాము. చిత్రాన్ని ఆగస్ట్ 12కు బదులు ఆగస్ట్ 13 న రిలీజ్ చేస్తున్నాం. కంటెంట్‌ను బట్టే నా సినిమాల విడుదల ఉంటుంది. ‘కార్తీకేయ2 ,  స్పై (Spy)’ చిత్రాలకు ఆ సత్తా ఉంది కాబట్టే పాన్ ఇండియా వైడ్ విడుదల చేస్తున్నాము. సినిమాల విడుదల డేట్ మారటమనేది ఒక మిస్టరీ అయింది. రిలీజ్ క్లాష్ లేకుండా ఉండాలనేది నిర్మాతల నిర్ణయం. అందులో భాగంగా  నా సినిమా రిలీజ్ లు మారుతూ వచ్చాయి.. నాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యం. నటులకు పార్టీలతో పని లేదు. మంచి ఎవరు చేసినా నటులైన మేము అభినందిస్తాము’.. అని నిఖిల్ తెలిపారు. 


పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ నడుస్తోంది. సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ‘అర్జున్ సురవరం’ (Arjun Suravaram) చిత్రం తర్వాత నిఖిల్ నటించిన సినిమా ఇదే కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది. విజువల్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తుందని, అలాగే సినిమాలోని కంటెంట్ యూనివర్సల్‌‌గా అందరినీ మెప్పిస్తుందని మేకర్స్  చెబుతున్నారు. మరి ఈ సినిమా నిఖిల్ కు ఏ స్థాయి సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-08-03T20:05:56+05:30 IST