Karthikeya 2 : విడుదల వాయిదా?

ABN , First Publish Date - 2022-07-03T20:23:48+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Karthikeya 2 : విడుదల వాయిదా?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తుండగా.. సత్య (Satya), శ్రీనివాస్ రెడ్డి (Srinivasareddy) తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమా ఖేర్ (Anupam Kher) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేశాయి. 


సముద్రం దాచుకొన్న ద్వారకా నగరం.. దానివెనుకనున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఇదే కథాంశంతో గతంలో వెంకటేశ్ (Venkatesh) ‘దేవీపుత్రుడు’ (Deviputrudu) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చైల్డ్ సెంటిమెంట్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కథాంశంతో థ్రిల్లర్ కాన్సెప్ట్ గా ఈసినిమా రానుండడం విశేషం.ఇక   ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తు్న్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-03T20:23:48+05:30 IST