Karthikeya 2: లేటెస్ట్ అప్‌డేట్..

ABN , First Publish Date - 2022-07-31T17:07:34+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Sidharth) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కార్తికేయ 2' (Karthikeya 2). తాజాగా ఈ మూవీ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది.

Karthikeya 2: లేటెస్ట్ అప్‌డేట్..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Sidharth) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కార్తికేయ 2' (Karthikeya 2). తాజాగా ఈ మూవీ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. థ్రిల్లిర్ సినిమాలతో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న నిఖిల్ బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా నిలిచాడు. ఇక తన కెరీర్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'కార్తికేయ' కి సీక్వెల్‌గా నిర్మించిన 'కార్తికేయ 2'తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రాన్ని చందూ మొండేటి (Chandu Monedi) దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwan) ఇందులో నిఖిల్ సరసన నటించింది. 


అయితే, ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు ప్రమోషన్స్ గురించి ఒక అప్‌డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిలో "మేము నాలుగు ముఖ్య నగరాల్లో నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను దాచిపెడుతున్నాము. వాటిని ఎవరైనా కనిపెట్టి చెప్పాలి" అని తెలిపారు. అలాగే, .. "వీటికి క్లూ కూడా ఇస్తాము. ఒకవేళ అది గనక కనిపిడితే 6 లక్షల విలువైన ఆ బంగారు ప్రతిమ మీ సొంతం అవుతుంది".. అని ఓ క్రేజీ ఆఫర్ ని అనౌన్స్ చేశారు. 


ఇక దీనికి సంబంధించిన ఫస్ట్ హింట్ ని కూడా మరికొన్ని గంటల్లో అందిస్తాము అని హీరో నిఖిల్ తెలిపాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా, కార్తికేయ 2 ఈ ఆగస్టు 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో నిఖిల్ నుంచి సినిమా రాలేదు. మరి ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. అలాగే, అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి '18 పేజెస్' అనే సినిమాను కూడా చేస్తున్నాడు నిఖిల్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా విడుదలకి సిద్ధమవుతోంది.



Updated Date - 2022-07-31T17:07:34+05:30 IST