Chandoo Mondeti: నేను చెప్పాల్సింది ఇంకా చాలా వుంది

ABN , First Publish Date - 2022-08-11T00:32:50+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంట‌గా.. చందూ మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో.. సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (karthikeya)కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం

Chandoo Mondeti: నేను చెప్పాల్సింది ఇంకా చాలా వుంది

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంట‌గా.. చందూ మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో.. సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (karthikeya)కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ‌ 2’ (karthikeya 2). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై.. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


హైదరాబాద్‌లో జరిగిన ఈ మీడియా సమావేశంలో చందూ మొండేటి మాట్లాడుతూ..

‘‘చిన్నప్పటి నుంచి నేను రామాయణం, మహాభారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాడిని. అలా ఇతిహాసాలపై ఎక్కువ ఆసక్తి ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్‌తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకలో వున్నాడా లేడా? అనే పాయింట్‌తో ఈ సినిమాను తీయడం జరిగింది. అందుకు కృష్ణతత్త్వం కాన్సెప్ట్ తీసుకొని ఇప్పటితరానికి ఆయన గొప్పతనం గురించి చెప్పబోతున్నాము. శ్రీకృష్ణుడిని మోటివ్‌గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. భక్తి‌తో పాటు అడ్వెంచర్‌తో కూడిన థ్రిల్లింగ్ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు. (Chandoo Mondeti Interview)


‘కార్తికేయ’ విజయం తర్వాత ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌కు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ‘కార్తికేయ’లో నిఖిల్ హీరోగా చేయడంతో.. ఈ సినిమాలో నటించడం చాలా ఈజీ అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తే.. ఇందులో డాక్టర్‌గా నిఖిల్ కనిపిస్తాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వైవా హర్ష, సత్య వీరందరూ బిజీగా ఉన్నా.. ఈ కథ, కాన్సెప్ట్ నమ్మి.. మాతో ట్రావెల్ అయ్యారు. ‘కార్తికేయ 2’లో స్వాతి (Swathi)కి స్కోప్ ఉన్న పాత్ర లేదు. అందుకే ఆమెను తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా.. మీకు సెకెండ్ పార్ట్ అర్థమవుతుంది. ‘లగే రహో మున్నాబాయి’ కంటే ముందు ‘మున్నాభాయ్ MBBS’ సినిమాలా క్యారెక్టరైజేషన్స్ క్యారీ చేస్తుంది. కానీ కథ మాత్రం వేరు.


కథ హిమాచల్ ప్రదేశ్‌లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్‌ను తీసుకోవడం జరిగింది. ఆయన సీన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) సినిమాకు, ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు. ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. ఈ సినిమాని బడ్జెట్‌లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది. అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ పరిస్థితులు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడ్వెంచర్‌ కాన్సెప్ట్ తోనే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వియఫ్‌ఎక్స్ షాట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులకు గ్రాండ్‌గా బిగ్ స్క్రీన్‌పై మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు వారు చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే వారికి ఇతిహాసాలపై ఒక అవగాహన వస్తుంది. (Director Chandoo Mondeti Interview)


నేను చెప్పాల్సింది ఇంకా చాలా వుంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను. ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts)లో ఓ సినిమా ఉంటుంది. రెండు కథలు రెడీగా వున్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రం. మరొకటి సోషల్ డ్రామా. ఈ రెండింటిలో ఏ కథ ముందు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్‌లో చేసిన తర్వాత నాగార్జున (King Nagarjuna)గారితో మరో చిత్రం చేయబోతున్నాను...’’ అని ఆయన చెప్పుకొచ్చారు.



Updated Date - 2022-08-11T00:32:50+05:30 IST