Karthikeya 2: థియేట్రికల్ ట్రైలర్‌ 2కి డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2022-08-02T19:12:05+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), చందు మొండేటి (Chandu Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ (Karthikeya) చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 (Karthikeya 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Karthikeya 2: థియేట్రికల్ ట్రైలర్‌ 2కి డేట్ ఫిక్స్

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), చందు మొండేటి (Chandu Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ (Karthikeya) చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 (Karthikeya 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 కి అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ చక్కటి విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 6న కార్తికేయ 2 మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ 2ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ట్రైలర్ 1తో ఈ సినిమాపై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ట్రైలర్ 2 ఉండనుంది. ఇక కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.


కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran).. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2.  

Updated Date - 2022-08-02T19:12:05+05:30 IST