Karthikeya 2: విడుదలపై క్లారిటీ వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-07-12T17:32:24+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2).

Karthikeya 2: విడుదలపై క్లారిటీ వచ్చేసింది..

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఈ సినిమా రిలీజ్ విషయంలో హీరో సిద్దార్థ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ మూవీ చందుమొండేటి (Chandu Mondeti) దర్వకత్వంలో.. పురాతన దేవాలయం బ్యాక్ డ్రాప్‌లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది చిత్రం. 


ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకృష్ణ తత్వంపై రెండో భాగం మరింత ఆసక్తికరంగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే, ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ముందు అనుకున్నారు. అయితే, ఆ తేదీకి రిలీజ్ కావడం లేదు.


ఈ విషయాన్ని చిత్ర హీరో నిఖిల్ తాజాగా ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. దీనిలో 'కార్తికేయ 2 జూలై కాకుండా ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుపుతూ ఇప్పటికే ప్రీమియర్ షోస్ కోసం టికెట్ కొన్న ప్రేక్షకులకు ఆ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది'.. అని రాసుకొచ్చారు. అంతేకాదు, మూవీ పోస్ట్ చేస్తున్నందుకు గానూ, ప్రేక్షకు సారీ కూడా చెప్పాడు నిఖిల్. కాగా, త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. 



Updated Date - 2022-07-12T17:32:24+05:30 IST