Karthikeya 2: అనుపమ, అనుపమ్ ఖేర్ పాత్రలివే..

ABN , First Publish Date - 2022-06-11T14:17:21+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) వరుస విజయాలతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చందు మొండేటి (Chandu Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ (Karthikeya) సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

Karthikeya 2: అనుపమ, అనుపమ్ ఖేర్ పాత్రలివే..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) వరుస విజయాలతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చందు మొండేటి (Chandu Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ (Karthikeya) సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే కార్తియేక 2 (Karthikeya 2) నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఇందులో నటిస్తున్న హీరోయిన్ సహా ఇతర కీలక పాత్రలను పరిచయం చేసింది చిత్రబృదం. ఇటీవల 'సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ'.. హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ కార్తికేయ 2 మూవీపై ఆసక్తి రేపింది.


అంతేకాదు, ఈ మోషన్ పోస్టర్‌పై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ‌ 2పై ప్రశంసల వర్షం కురిపించారు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 


అయితే, మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తుంది. అలాగే, ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కనిపించనున్నారు. వీరితో పాటు శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానంద పాత్రలో శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష సందడి చేయనున్నారు. వీళ్ళ ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. కాగా, కార్తికేయ 2 అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

Updated Date - 2022-06-11T14:17:21+05:30 IST