రష్యాలో భారీ ఎత్తున రిలీజైన కార్తి Khaidi

ABN , First Publish Date - 2022-05-19T17:00:56+05:30 IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తి (Karthi) కెరీర్‌లో ది బెస్ట్ అనిపించుకొన్న చిత్రం ‘ఖైదీ’ (khaidi). దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj)కిది మొట్టమొదటి చిత్రం. గ్రిప్సింగ్ స్ర్కీన్ ప్లేతో, ఉత్కంఠను రేపే సన్నివేశాలతో.. చక్కటి ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

రష్యాలో భారీ ఎత్తున రిలీజైన కార్తి Khaidi

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తి (Karthi) కెరీర్‌లో ది బెస్ట్ అనిపించుకొన్న చిత్రం ‘ఖైదీ’ (khaidi). దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj)కిది మొట్టమొదటి చిత్రం. గ్రిప్సింగ్ స్ర్కీన్ ప్లేతో, ఉత్కంఠను రేపే సన్నివేశాలతో.. చక్కటి ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే స్థాయిలో సక్సెస్ అయింది ఈ చిత్రం. ఏదో నేరం మీద జైలుకెళ్ళిన ఒక ఖైదీకి.. పోలీస్ డిపార్టమెంట్‌కు ఎదురైన ఒక సమస్యను పరిష్కరించే పని అప్పగిస్తాడు ఓ పోలీసాఫీసర్. అయితే పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా చూడని తన కూతురిని చూడనిస్తే ఆ పని చేసి పెడతానని కండీషన్ పెడతాడు ఖైదీ. దాంతో అతడి కోరికను తీరుస్తానని మాటిస్తాడు ఆ ఆఫీసర్. మరి ఆ ఖైదీ  పోలీసుల సమస్యను ఎలా సాల్వ్ చేసి.. తన కూతురిని కలుసుకున్నాడు అన్నదే మిగతా కథ. ఖైదీగా కార్తి, పోలీసాఫీసర్‌గా నరేన్ (Narain) నటించిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్‌ను బాగా వర్కవుట్ చేశాడు దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న ‘ఖైదీ’ (Khaidi) చిత్రం ఇప్పుడో రేర్ ఫీట్ సాధించింది. 


‘ఖైదీ’ (Khaidi) చిత్రాన్ని రష్యా (Russia) లో ఈ రోజే (మే 19)  భారీ ఎత్తున  విడుదల చేశారు. అక్కడ ఏకంగా 121 సిటీస్, 297 స్ర్కీన్స్ లో ఈ సినిమాను విడుదల చేయడం గొప్ప విషయంగా చెప్పాలి. రష్యన్ భాషలో డబ్బింగ్ చేసి అక్కడ ఈ సినిమాను విడుదల చేయడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీయల్‌గా ప్రకటించారు. ఈ సందర్బంగా ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌ను కూడా షేర్ చేశారు. ఇలా ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రం .. రష్యాలో భారీ లొకేషన్స్ లోనూ, స్ర్కీన్స్ లోనూ విడుదలవుతుండడం చాలా అరుదనే చెప్పాలి. మరి రష్యాలో ఖైదీ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-05-19T17:00:56+05:30 IST