Karthi: ‘ఖైదీ-2’ కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన స్టార్ హీరో

ABN , First Publish Date - 2022-08-10T21:37:57+05:30 IST

విభిన్న పాత్రలు, వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కార్తి (Karthi). తాజాగా అతడు నటించిన చిత్రం ‘విరుమన్’ (Viruman). అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. 2-డీ ఎంటర్‌ టైన్‌మెంట్స్

Karthi: ‘ఖైదీ-2’ కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన స్టార్ హీరో

విభిన్న పాత్రలు, వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కార్తి (Karthi). తాజాగా అతడు నటించిన చిత్రం ‘విరుమన్’ (Viruman). అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. 2-డీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కార్తి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ‘ఖైదీ-2’ కు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌‌ను అభిమానులతో పంచుకున్నాడు. 


‘విరుమన్’ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తి కేరళకు వెళ్లాడు. ఈ సందర్భంగా ‘ఖైదీ-2’ (Kaithi 2) షూటింగ్ 2023లో ప్రారంభమతుందని చెప్పాడు. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) విజయ్‌తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ‘ఖైదీ-2’ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. ‘ఖైదీ-2’ లో రోలెక్స్ పాత్ర ఉంటుందో, లేదో తనకు తెలియదని తెలిపాడు. ప్రస్తుతానికీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టం అని వెల్లడించాడు. కార్తి గతంలో నటించిన సినిమా ‘ఖైదీ’. ఈ చిత్రంలో డిల్లీ పాత్రలో అతడు కనిపించాడు. ఈ మూవీకి లోకేశ్ దర్శకత్వం వహించాడు. లోకేశ్ తెరకెక్కించిన మరో సినిమా ‘విక్రమ్’ లో రోలెక్స్ పాత్రలో సూర్య అలరించాడు. ‘విక్రమ్’ లో ఓ సీన్‌లో డిల్లీ పాత్రకు సంబంధించి కార్తి వాయిస్ వినిపిస్తుంది. కానీ, అతడు మాత్రం కనిపించాడు. దీంతో లోకేశ్ తెరెక్కించే తదుపరి చిత్రంలో ఈ సోదరులిద్దరు కలసి నటిస్తారనే వదంతులు హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. ‘ఖైదీ’ కి కొనసాగింపు చిత్రం ఉంటుందని లోకేశ్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.

Updated Date - 2022-08-10T21:37:57+05:30 IST