Sunny Leone బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన యూత్.. మీ బాటలోనే నడుస్తానంటూ హీరోయిన్ పోస్ట్..

ABN , First Publish Date - 2022-05-16T00:39:30+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ సన్నీలియోన్(Sunny Leone). ‘జిస్మ్-2’(jism 2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జాక్‌పాట్’ (Jackpot), ‘రాగిణీ

Sunny Leone బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన యూత్.. మీ బాటలోనే నడుస్తానంటూ హీరోయిన్ పోస్ట్..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ సన్నీలియోన్(Sunny Leone). ‘జిస్మ్-2’(jism 2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జాక్‌పాట్’ (Jackpot), ‘రాగిణీ ఎంఎంస్-2’(Ragini MMS 2), ‘హేట్ స్టోరీ-2’ (Hate Story 2) వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ‘కరెంటు తీగ’(Current Theega), ‘పీఎస్‌వీ గరుడ వేగ’(PSV Garuda Vega) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ‘అనామిక’ (Anamika) వెబ్ సిరీస్‌లో కనిపించి అందరినీ అలరించింది. సన్నీలియోన్ మే 13న పుట్టిన రోజు జరుపుకొంది. ఈ బర్త్‌డే బాష్‌కు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ అందాల సుందరి అభిమానులు కూడా దేశ వ్యాప్తంగా ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. సన్నీ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని ఓ గ్రామం రక్తదాన శిబిరం నిర్వహించింది. దీంతో సంతోషంలో మునిగిపోయిన ఆమె వారి బాటలోనే నడుస్తానని చెప్పింది. 


ఆ గ్రామాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో సన్నీ లియోన్ ఓ పోస్ట్ పెట్టింది. తాను కూడా రక్తదానం చేస్తానని వాగ్దానం చేసింది. ఈ రక్తదాన శిబిరాన్ని కర్ణాటకలోని కొమ్మెరహళ్లి (Kommerahalli ) గ్రామం నిర్వహించింది. అందుకు సంబంధించిన వార్త ఓ పత్రికలో వచ్చింది. ఆ పేపర్ కటింగ్‌ను సన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘‘ ఓ మై గాడ్! ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. మీ గౌరవార్థం నేను కూడా రక్తదానం చేస్తాను. థ్యాంక్ యూ సోమచ్. లవ్ యూ’’ అని ఆమె సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేసింది. వివిధ పత్రికల్లోని కథనాల ప్రకారం.. కొమ్మెరహళ్లి గ్రామానికీ చెందిన యూత్ సన్నీ లియోన్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కేక్‌ను కోసి, టపాసులు కాల్చారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించి దాదాపుగా 39యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సన్నీలియోన్ అనాథ పిల్లలకు సహాయం చేస్తుంది కాబట్టి ఆమె గౌరవార్థం రక్తదాన శిబిరాన్ని నిర్వహించమన్నారు. ఆమె పుట్టినరోజును కొమ్మెరహళ్లి గ్రామ యూత్ సెలబ్రేట్ చేయడం ఇది రెండోసారి.



Updated Date - 2022-05-16T00:39:30+05:30 IST